6, నవంబర్ 2012, మంగళవారం

కాబా యాత్ర- స్వర్గరాయి

మక్కాకు పోయిన ముస్లిములు అక్కడున్న గోడకో,గోడలో ఉన్న రాయికో మొక్కుతారని ,మసీదులో కూడా విగ్రహం ఏమీ ఉండదు గనుక ఎదురుగా ఉన్న గోడకు మొక్కుతారనీ కొంతమంది పద్యాలు రాసి మరీ చెబుతున్నారు. తెలిసిన పెద్దలు కాస్త వివరిస్తారా?హజ్రె అస్వద్ అనే స్వర్గ రాయిని ముస్లిములు పూజించరు గానీ తెల్లగా ఉన్న ఆ రాయికి మనిషి పాపాలను పీల్చుకొని నల్లబడే గుణం ఉందని కొందరి నమ్మకం.అది వట్టి రాయి మాత్రమే,ప్రవక్త ముద్దాడాడు కాబట్టే మనమూ ముద్దాడాలి అని కొందరి నమ్మకం.బ్రహ్మకుమారీలు మాత్రం దానిని మహిమాన్వితమైన దైవరాయిగానే చెబుతున్నారు. హర్ కంకర్ శంకర్ ప్రతి రాయీ దేవుడే  అనే వాళ్ళున్నారు.రాయి ఎన్ని రూపాలు పొందిందోఃకాబా గోడలో అమర్చిన హజ్రె అస్వద్‌  అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు.హిందువులు ఈ రాయిని కైలాస రాయి శివలింగంగా భావించి గౌరవిస్తారు.ఈ రాయిలో ఉన్న రహస్యమేంటో ? అని అడిగితే https://www.facebook.com/nrahamthulla/posts/487336204631708 లో జరిగిన చర్చ ఇదిః
Syed Abdus Salam  :
1. ఇది స్వర్గం నుండి దించబడిన ఒక రాయి. ఇది ముందు పాలకన్నా తెల్లగా ఉండేది, తర్వాత మనిషి పాప మసితో నల్లబడింది. ఈ రాయిని ప్రేమగా తాకడం, ముద్దాడటం సున్నత్‌. ఈ రాయి ఎవరికి ఏ విధమైనటువంటి లాభం గానీ, నష్టంగానీ చేకూర్చజాలదు.ముస్లిం మక్కా వెళ్ళి ఈ రాయిని పూజిస్తారన్న మాట పూర్తి అవాస్తవం. ఈ రాయిని శుభప్రదంగా భావించి ఈరాన్‌ దేశస్థులు తమతోపాటు పట్టుకెళ్ళి 20 సంవత్సరాలు తమ వద్దే పెట్టు కున్నారు. ఈ రాయిలేనప్పుడు కూడా హజ్జ్‌ఉమ్రాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే కాబాలో  360 విగ్ర హాల్ని పూజించే సమయంలో సయితం ఈ రాయిని కొలవలేదు.తర్వాతి కాలంలో దండయాత్రల కారణంగా ఈ రాయి ముక్క లయిపోయింది. ప్రస్తుతం అది ఎనిమిది ముక్కలుగా మరో పెద్ద రాయిలో అమర్చబడి ఉంది.
2 ) మొదటి దైవగృహం కాబా .'బైతుల్‌ మక్దిస్ కాదు.
''భూమండలం మీద మొట్టమొదట నిర్మించ బడిన దైవ గృహమేది? అని అడగ్గా - 'కాబా' అన్నారు ప్రవక్త . ఆ తర్వాత ఏ గృహం అని ప్రశ్నించ గా - 'మస్జిదె అఖ్సా' అన్నారు. ఈ రెంటికి మధ్య ఎంత కాలం తేడా ఉందని అడగ్గా - '40 సంవత్సరాలు'' అని ప్రవక్త (స) బదులి చ్చారు. ఈ గృహాన్ని దైవ దూతలు నిర్మిం చారు. తర్వాత ఆది మానవుడైన ప్రవక్త ఆదం ఈ గృహం మీద డోము కట్టిం చారు. ఆనక అది నూహ్‌ గారి కాలంలో వచ్చిన జలప్రళయంలో నేలమట్టం అవగా, తర్వాత దైవ దూత జిబ్రయీల్‌  సూచనల మేరకు ప్రవక్త ఇబాహీమ్‌  అవే పునాదులపై ఈ గృహాన్ని పునర్నిర్మించారు. సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ''దేవుని  3) ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి''. (అల్‌హజ్జ్‌: 29)
ప్రాచీన గృహం అంటే పవిత్ర కాబా గృహమే. ప్రదక్షిణ కేవ లం కాబాకు మాత్రమే ప్రత్యేకం. ఇతర ప్రార్థ నాలయాల వద్ధ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు. ''భూ మండలంలో కాబా ఎక్కడుందో దానికి నేరుగా ఏడు ఆకాశాలపైన బైతుల్‌ మామూర్‌ ఉంది. దానిపైన స్వర్గం ఉంది. స్వర్గ శిఖర భాగమైన ఫిర్‌దౌస్‌ పైన అల్లాహ్‌ అర్ష్‌ ఉంది''. (దారమీ)
''తవాఫ్‌ చేస్తూ మనిషి వేసే ప్రతి అడుగుకి బదులు పది పుణ్యాలు లిఖించబడతాయి. పది పాపాలు మన్నించ బడతాయి. స్వర్గపు పది అంతస్థులు పెంచబడ తాయి''. ''మస్జిదె హరామ్‌లో ఒక నమాజు చేయడం అనేది ఇతర మస్జిద్‌లలో లక్ష నమాజులు చేసేంతటి పుణ్యానికి సమానం''
''మూడు మస్జిద్‌ల వైపు తప్ప మరే ఇతర చోటుకి పుణ్యఫలాపేక్షతో ప్రయాణం చేయ కూడదు. 1) మస్జిదె హరామ్‌ (కాబా). 2) మస్జిదె అఖ్సా 3) నా ఈ మస్జిద్‌ (మస్జదె నబవీ)''
4) అది సమస్తలోకవాసుల కోసం మార్గదర్శక కేంద్రం.
ఈ గృహాన్ని (కాబాను) మాన వులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయం గానూ చేశాము''. (అల్‌ బఖరా: 125)
'మసాబతల్లిన్నాస్‌' అంటే పుణ్యక్షేత్రం మరియు మాటిమాటికీ మరలి రావలసిన స్థలం. అదొక శాంతి నిలయం. అక్కడ శత్రు భయం కూడా ఉండదు.ప్రజలు ఆ పుణ్య క్షేత్రం పరిధిలో శత్రువును, స్వయాన తండ్రిని చంపిన హంతకుణ్ణి సయితం సంహరించే వారు కాదు.
ఏడాదిపొడవునా కాబా గృహం భక్తుల ప్రదక్షిణలతో ఉం టుంది. నీరూ, పచ్చికా లేని ఆ కొండ ప్రాం తంలో నేడు విశ్వమంతటి నుంచి రకరకాల పండ్లు, కూరగాయలు పుష్కలంగా వచ్చి పడు తున్నాయి. హజ్జ్‌ సీజన్‌లోనూ, రమజాన్‌ మాసంలోనూ అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలు దాటి కోటికి చేరుతున్నా ఆహార సర ఫరాలలో ఎలాంటి కొరతా ఏర్పడదు. ఇటు వంటి మహిమాన్విత నగరం మక్కా పురం మినహా లోకం మొత్తంలో మరొకటి ఉందా?
5) ''మీరు ఇబ్రాహీము నిలబడిన (మకామె ఇబ్రా హీమ్‌) ప్రదేశాన్ని ప్రార్థనా స్థలంగా చేసు కోండి''. (అల్‌ బఖరా: 125)
మకామె ఇబ్రాహీమ్‌ అన్నది ఒక రాయి. ఇబ్రాహీమ్‌ ఆ రాతి మీదే నిలబడి కాబా గృహాన్ని నిర్మించారు. ఆ రాయిపై ఆయన పాద చిహ్నాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాయి ఒక అద్దాల కేసులో సురక్షితంగా ఉంచ బడింది.  
6) ''నిశ్చయంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాల లోనివి''.(బఖరా: 158) హజ్రత్‌ హాజిరా (అ) వారి నిరుపమాన త్యాగానికి గుర్తు సఫా మర్వాల మధ్య సయీ.
7) ''గౌరవప్రద గృహమైన 'కాబా'ను అల్లాహ్‌ మానవాళి మనుగడకు సాధనంగా చేశాడు''. (అల్‌ మాయిదా: 97) .
కాబా  గృహం గౌరవప్రదంగా  ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచం ఉంటుంది. ఈ విశ్వాన్ని అంతం చేయాలని విశ్వకర్త తలచినప్పుడు కాబా గృహం కూల్చివేయబడుతుంది.  ''(ప్రళయ సమీపంలో) ఎలాంటి గౌరవ మర్యాదలు లేని పొట్టి కాళ్ళ నీగ్రో కాబాను నిర్మానుష్యంగా మార్చేస్తాడు''. అంటే ఆ నీగ్రో వ్యక్తికన్నా ముందు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ గృహాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం ఎవరి తరం కాదు. 70 వేల ఏనుగల సైన్యంతో వచ్చి అబ్రహాను నాశనం చేసినట్లే ఈ గృహానికి చెడు తలపెట్టాలనుకొని పన్నాగాలు పన్నే ప్రజల్ని, ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ నామరూపాల్లేకుండా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.
8 ) కాబా 'బైతుల్‌ హరామ్‌' (పవిత్ర గృహం, గౌరవమర్యాదల గృహం). దాని పరిధిలో వేటాడటం, చెట్లు నరకటం నిషేధించబడ్డాయి. ఆఖరికి కన్న తండ్రిని చంపిన దుర్మార్గుడు తారస పడినా ఆ పరిధిలో ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతించబడలేదు. ఈ పవిత్ర గృహ మూలంగా మక్కా వాసుల జీవనం సుఖప్రద మవ్వటమేకాకూండా, ఆర్థికంగా అది వారికి బలం చేకూరుస్తుంది. మక్కా ప్రజలకు లేదా సవూదీ ప్రజల కు లభించే ఈ స్వాగతసన్మానాలు, గౌరవవాదరణలు కాబా గృహ కారణంగానే. ఈ కాబా గృహం వల్లనే మక్కాలోని జనులు సుఖశాం తులతో వర్థిల్లుతున్నారు. ప్రపంచం మొత్తం అశాంతి అల జడులమయమై ఉన్నా అక్కడ మాత్రం శాంతి సుస్థిరతలున్నాయి.
ఇంతటి గౌరవం ఒక్క మక్కాకే ఎలా దక్కింది? ''నిశ్చయంగా అల్లాహ్‌, ఈ పట్టణాన్ని భూమ్యాకాశాలను పుట్టించిన నాటి నుండే పవిత్రంగా చేశాడు. అది ప్రళయం వరకూ అల్లాహ్‌ అనుగ్రహించిన ఔన్నత్యంతో పవిత్రంగానే చూడబడుతోంది''.
నేడు మానవులు అనేక స్థలాలను, ప్రదేశాలను పవిత్రంగా చేసుకున్నారు. ఆ స్థలం, ప్రాంతం ఏ సమాజానికి, మరే మతానికి సంబంధించినదైనా కావచ్చు. మక్కా అంతటి పవిత్రత, గౌరవం వాటిలో ఏ ఒక్కటికీ లేదు. మక్కాకు లభించిన పవిత్రత సనాతనం, నిత్య నూతనం, దైవ ప్రసాదితం. ఇతర ప్రాంతాల కు లభించినది మానవ కల్పితం, కృత్రిమం, క్షణికం. ఏ నిమిషం మనిషి చేసిన సిద్ధాం తాలు దేనిక కొరగాకుండా పోతాయో మరుక్షణం ఆయా స్థలాలు, ఆలయాలు తమ పవిత్ర తను కోల్పోతాయి. స్వయం మనిషే తన స్వహస్తాలతో వాటిని కుప్పకూలుస్తాడు. అయితే మక్కాలోని కాబా అటువంటిది కాదు. దీనికి సుదీర్ఘమైన మానవ చరిత్రే ప్రత్యక్ష సాక్షి!
9) అల్లాహ్‌ కాబా గృహం వైపు ముఖం త్రిప్పి నమాజు చేయవలసిందింగా ఆదేశించాడు: ''(ఓ ప్రవక్తా!) ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపు నకే త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నాసరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి-జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలో దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంత మాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్నార్గ గాములు అవటానికి''.(అల్‌బఖర: 150)
'కాబా' వైపు ముఖం త్రిప్పి నమాజు చేయండి అన్న దిశ మార్పును దేవుడు తన అనుగ్రహాల పరిపూర్తి గా, సన్మార్గ భాగ్యానికి ప్రతీకగా అభివర్ణించాడు.
10) ''శాంతియుతమైన ఈ నగరం సాక్షిగా!''. (తీన్‌: 4) ''ఈ నగరం తోడుగా!'' (బలద్‌; 1)
అల్లాహ్‌ ఈ ఆయతులలో మక్కా నగరంపై ఒట్టేసి విషయం చెబుతున్నాడంటే, ఈ నగరం ప్రాస్తశ్యాన్ని ఊహించ వచ్చు. దైవ ప్రవక్త (స) మక్కాను వీడి వెళు తూ 'హజ్వరా' ప్రదేశంలో నిలబడి మక్కా నుద్దేశించి ఇలా అన్నారు: '' మక్కా! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. నీవు అల్లాహ్‌ భూభాగాలన్నింటిలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన నేలవు. భూభాగాలన్నిం టిలోకెల్లా అల్లాహ్‌కు అత్యంత ప్రియ మైన భూభాగానివి. నాకూ నీవు మిక్కి ఇష్టమైన భూభాగానివే. మక్కా వాసులే గనక నన్ను నీ నుండి వెలివేసి ఉండక పోతే నేను ఎన్నటికీ నిన్ను వీడి వెళ్ళేవాడను కాను.నిన్ను వీడి మరో భూభాగంలో నివాసం ఏర్పచుకునేవాడను కాను''. (తిర్మిజీ)
11) మహిమాన్వత నగరం మక్కా పురం అంటే అనంత కరుణామయుడైన అల్లాహ్‌కు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం కూడా మక్కా నగరాన్ని, అందులోని ప్రతి ప్రదేశాన్ని ప్రేమిం చాలి, అభిమానించాలి, గౌరవించాలి. స్థాయి, స్థోమత ఉంటే ఆ గృహాన్ని ఉద్దేశ్యించి హజ్జ్‌ చేయాలి. ''అక్కడికి వెళ్ళే స్థోమత గల వారికి, అ గృహ (యాత్ర) హజ్జ్‌ చేయ డాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంత మాత్రం లేదు''.(ఆలి ఇమ్రాన్‌: 97). ఈ కారణంగానే దాదాపు ప్రవక్తలు తమ శేష జీవితాన్ని ఈ పట్టణంలో జీవించి కన్ను మూయాలని ఆశ పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి మరింత మంచి సౌక ర్యాలతో బ్రతకటానికి జీవనోపాధిని వెతు క్కుంటూ ప్రపంచ నలుమూలలా వేళతాడు. కానీ మక్కా వెళ్ళే వారు మాత్రం అక్కడే మర ణించాలని, అక్కడ మరణం రావడం తమ భాగ్యమని బయలుదేరతారు. అంటే, భూ ఇతర భాగాలు మనిషిని పదార్థ పూజారిగా, దానవుడిగా మార్చితే, మక్కా పురం మనిషిని పరమాత్మదాసుడిగా, మనసున్న మనీషిగా తీర్చిదిద్దుతుంది.
గోడకో రాయికొ అంటున్నారు సరే. మరి మైదాన ప్రదేశంలో చేస్తేనో...ఫ్లైట్లో....గాలిలో చేస్తేనో ....సముద్రయానం చేస్తూ నీటిలో చేస్తేనో...ప్రవక్త ముహమ్మాద్ (స) చెప్పిందేమిటంటే - ''భూమండలం మొత్తం మస్జిదే" నమాజు సమయం ఐనప్పుడు మనం ఎక్కడ ఉన్నా పరిశుభ్రమైన నేలపై సామూహికంగానైనా, ఒంటరిగానైనా ప్రార్థన చేసుకోగలదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే...అయెతే ఈ అపోహ తెలుగు పాఠ్య పుస్కాలకు సైతం సోకడం మిక్కిలి విచారకరం ... దీన్ని నిజం తెలిసిన లౌకికవాదులు కొందరు ఖండించి ఉన్నారు కూడా..ఇక ఖురాన్లోని ఒక వాక్యాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. ''వారు ఈ గృహం యొక్క ప్రభునే ఆరాధించాలి'' (106;3) పొతే ఒక్క కబాయే కాక నిజ దైవారాధన చేయబడే స్థలాలన్నీ దైవ గృహాలే.అన్నది గమనార్హం!


Ma Siddhique  ఇది కేవలం హజ్ మరియు ఉమ్రాలలొ ఉన్న ఒక అచారం. ఇస్లాం దేవుని ఏకత్వంపై మరియు విగ్రహారాధనకు వ్యతిరేకత పై నిలిచి ఉంది. మీరు రాయీ అని ప్రస్తావించినది 'హజ్రె-అస్వడ్ ని. దాన్ని తాకడం, చుంబించడం కేవలం ప్రవక్త అచరించారు కాబట్టి ఆచరిస్తారు. ముస్లింలకు తెలుసు అందులొ ఎటువంటి మహత్యం లేదని. ·  Bukhari : Book 2 : Volume 26 : Hadith No# 667 Narrated 'Abis bin Rabia: 'Hazrat Umar(R.A) came near the Black Stone(Hajr-E-Aswad) and kissed it and said "No doubt, I know that you are a stone and can neither benefit anyone nor harm anyone. Had I not seen Allah's Apostle kissing youI would not have kissed you."
Mohan Vamseedhar Batchu This act only resembles brother hood of Muslims around the world,where every one unite in one place....there are situations when people were invited for prayer(haja) by standing on that rock.This is only a place of union and no where related to worship it.... as Sri.jakeer nayak said.
తెలుగు రచన మనసే ఒక మందిరమైతే మరి ఈ ఆలయాలతో పని ఏముంది? ఆత్మ - పరమాత్మ రెండూ నీలోనే ఉన్నాయని చెబుతున్నప్పుడు మరి గుడి-గోపురాల అవసరమేముంది?అందులేడు ఇందుండ సందేహము వలదన్న పరమేశుని మాటలు పక్కనబెట్టి పర్వతలవెంట పరుగులుతీసే పని ఏముంది?ఏడ లేదు దైవం? ఏడికో ఎందుకు నీ పయనం?
Shaik Riyaz కాబా అనేది ముస్లిముల కోసం ఒక కేంద్రం లాంటిది :నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రధమంగా ఖరారు చేయబడిన(దైవ)గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే ఆది శుభప్రదమైనది,సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.”(దివ్యకుర్ఆన్ 3:96)
మేము ఈ గృహాన్ని(కాబా గృహాన్ని)మానవులందరి కోసం (ఆరాధనా)కేంద్రం గాను,శాంతి నిలయం గాను చేశాము…” (దివ్యకుర్ఆన్ 2:125)
ఇస్లాం ఇఖ్యతను కాంక్షిస్తుంది :అందుకే ప్రతి రోజు 5 పూటల నమాజు ద్వారా వీధిలోని వారిని,జుమా నమాజు ద్వారా పేటలోని వారిని,పండుగ నమాజు ద్వారా ఊరిలోని వారిని, హజ్జ్ ద్వారా విశ్వ మానవులను ఒక చోట చేరి తమ సృష్టికర్త,ప్రభువు,పాలకుడు,పోషకుడు,రక్షకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాదించమంటుంది.
కాబా ప్రదక్షిణం(తవాఫ్)దేవుని ఏకత్వానికి ప్రతీక :ముస్లింలు మక్కా నగరానికి వెళ్లినప్పుడు,అక్కడున్నటువంటి మస్జిదె-యే-హరాం ను సందర్శిస్తారు.మరియు కాబా (దైవగృహానికి)కు ప్రదక్షిణం చేస్తారు.వారి ఈ చర్య ఎకేశ్వరునిపై విశ్వాసం మరియు ఆయనొక్కడినే ఆరాధిస్తున్నారనే దానికి ప్రతీక.ఏ విధంగానైతే ఒక గుండ్రని పరిధికి కేవలం ఒకే కేంద్రబిందువు ఉంటుందో,అదేవిధంగా సకల ఆరాధనలకు ,పూజా పునస్కారాలకు ఆ ఒక్క నిజస్వామి ,మాత్రమే అర్హుడు.
ముస్లిములు కాబాలోని నల్లరాయిని పూజిస్తారు అనే అపోహా : కాబాలయంలో హజ్రే అస్వద్(నల్లటి రాయి) ని సంభోదిస్తూ ద్వితీయ ఇస్లామీయ ఖలీఫా హజ్రత్ ఉమర్(రజి) ఇలా అన్నారు నాకు తెలుసు నీవు మంచిగాని,చెడుగాని(లాభ,నష్టాలు గాని)కలిగించలేని కేవలం ఒక రాయివి మాత్రమే.దైవప్రవక్త(సల్లం) నిన్ను ముట్టుకోవటం (చుంభిన్చటం) నేను చూసి ఉండకపోతే,నేనెన్నడూ నిన్ను ముట్టుకొని(చుమ్భించి) ఉండక పోయేవాన్ని.”(బుఖారీ,ముస్లిం) దీన్ని బట్టి కూడా తెలిసే విషయమేమంటే అక్కడ ముస్లిములు కేవలం అల్లాహ్ ను మాతమే పూజిస్తారు,ఆరాధిస్తారు కాని కాబాకులేక నల్లరాయికి కాదు.
ప్రజలు కాబా పై ఎక్కి అజాన్ పిలుపునిచ్చేవారు ;మహా ప్రవక్త ముహమ్మద్(స) జీవితకాలంలోనైతే,ప్రజలు కాబా ఆలయం కప్పుపైకెక్కి నమాజు కోసం పిలుపు ఇచ్చేవారు. ఒకవేళ ముస్లిములు కాబాలయాన్ని పూజించేవారైతే దానిపై ఎక్కేవారా? ముమ్మాటికి అలా చెయ్యరు.
Noorbasha Rahamthulla ''భూమండలం మొత్తం మసీదే" "దైవారాధన చేయబడే స్థలాలన్నీ దైవ గృహాలే"-"ఏడ లేదు దైవం? ఏడికో ఎందుకు నీ పయనం?" "కాబాలయాన్ని పూజించేవారైతే దానిపై ఎక్కేవారా?" వాక్యాలు బాగున్నాయి.కొందరికి ఇంకో నమ్మకం కూడా ఉంది." కాబా గోడలోనూ,గోడలోని రాయిలోనూ దైవ శక్తులు దాగి ఉన్నాయి.అది మంచిగాని,చెడుగాని,లాభ,నష్టాలు గాని కలిగించలేని ఎటువంటి మహత్యం లేని కేవలం ఒక రాయి అయితే ప్రవక్త దానిని ఎందుకు ముద్దుపెట్టుకుంటారు?అది మహిమాన్వితమైన స్వర్గరాయి కాబట్టే కోట్లాది ముస్లిములు నిరంతరం దానిని ముద్దుపెట్టుకుంటూ లాభాలు పొందుతున్నారు.అది వాళ్ళ పాపాలను పీల్చుకుంటోంది.భక్తిభావన లేకుండానే రాయిని ముద్దుపెట్టుకోవటం అనే ఆచారం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?"అని.నిజమేనా?
Mohammad Naseeruddin * మనిషి తన పరిశోధనల ద్వారా రుజువైన ఓ విషయాన్ని దిస్ ఇజ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అని నమ్ముతున్నాడు. అందులో మార్పు జరిగే అవకాశం నూటికి నూరు శాతం ఉంది. అలాంటప్పుడు అల్లాహ్ దేనిని ఒక ఫ్యాక్ట్ గా, ఏలాంటి అనుమానం లేనిదిగా పంపాడు. దానిని ఏ అనుమానం, సందేహం లేకుండా నమ్మడంలో ఏమిటి ఇబ్బంది?. ఇస్లాం విషయానికి వస్తేనే లేనిపోని, స్వయంగా ప్రవక్త కాలంలోని అవిశ్వాసులు, బహుదైవారాధకులు లేవనత్తని ప్రశ్నలను, సందేహాలను ఒక పనిగా ముందుకు పెట్టుకొని అసలు ఆచరణకు, ప్రాక్టికల్ లైఫ్ కు అవసరమైన విషయాలను వెనకేయడం ఎంత వరకు సమంజసం?
* మన చేతికింద పని చేసే మనిషి మనం ఇచ్చే ఆదేశాలు తు చ తప్పకుండా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే మనం ఎలా ఫీలవుతాము? అల్లాహ్ ఇచ్చిన ఆదేశం గాని, ఆయన ప్రవక్త ఆదేశంగాని మనం కూడా తు చ తప్పకుండా పాటించి అందులోని మర్మాలను, ఔచిత్యాలను బైటికి లాగే ప్రయత్నాలు చేయకుండా ఉంటే మనం కూడా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు ఎంత గొప్ప విధేయులుగా ఉండినవాళ్ళం అవుతాము. తద్వారా ఇహపరాల్లో ఎంతటి గొప్ప పుణ్యాలకు అర్హులవుతాము.
* నల్లనిరాయి (హజ్రె అస్వద్) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించని, ఆయనను తిరస్కరించిన వారి కాలంలో కూడ ఉండినది. ఎన్నడూ వారిలో దాని గురించి ఏ సందేహం తలెత్త లేదు. వారు దాని గురించి ఏ ప్రశ్న అడగలేదు. మరి ఈనాటి బహుదైవారధకులు, వారి అనుయాయుల బుర్రలో ఇలాంటి సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయి?
* మినిస్టర్ వెంట కుక్క వచ్చినా ప్రజలు దానిని కూడా గౌరవంగా, గర్వంగా చూసుకుంటారు. ఇది మనలోని కొందరి పరిస్థితి ఉన్నప్పుడు ఏ రాయిని ప్రవక్త అల్లాహ్ అనుమతితో చుంబించారో, దానిని చుంబించడం వలన అల్లాహ్ చుంబించేవారి పాపాల్ని మన్నించే శుభవార్త తెలిపాడో దాని గురించి ఎందుకు ఇంతగనం సవాళ్ళు?
* భక్తి యొక్క అసలు అర్థం ఏదో రాయిని మహిమాన్వితమైనదని, గౌరవసూచికంగా ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు. మన అసలైన సృష్టికర్త అల్లాహ్ ఆదేశాల్ని తు చ తప్పకుండా పాటించడమే అసలైన భక్తి.

Noorbasha Rahamthulla Mohammad Naseeruddin మనిషికి అనుమానాలు సందేహాలు రావటం సహజం.అడిగిన వాడినల్లా బహుదైవారాధకులు అంటూ మీలాంటి మేధావులు అనుమానిస్తే ఎలా?చరిత్ర అడక్కు చెప్పింది విను అన్నట్లుంది.మినిస్టర్ గారి కుక్క అయినా సరే ఎవరూ ముద్దుపెట్టుకోరు.ప్రశ్న వెయ్యటానికే వీలులేదు ,తప్పు కళ్ళుపోతాయి అనకుండా సహనంతో జవాబు ఇవ్వగలిగితే పదిమందికి సంగతి తెలుస్తుంది.సమంజసంగా ఉంటే విధేయులౌతారు.ఇంకా పదిమందికి వివరిస్తారు.ఇంతకీ మక్కా గోడలోని రాయి మనిషి పాపాలను పీలుస్తుందా లేదా?
తెలుగు రచన
హజ్రె అస్వద్ (నల్ల రాయిని ముద్దుపెట్టుకుంటే పాపలు తొలగిపోతాయని మన ముస్లిం సోదరులు విశ్వసించి హజ్రే కెళ్ళినా,కాశి వెళ్లి గంగలో మునిగితే పాపాలు కడుగుకు పోతాయని హిందు సోదరులు నమ్మినా,ఇక్కడ ఉమ్మడి లక్షనమొక్కటే .. అదే విశ్వాసం.ఆ విశ్వాసమే హజ్రె అస్వద్ గా, నదిలో గంగగా, తిరుపతిలో వెంకన్న గా , ఇస్రాయెల్ లో ఆలయం గా తటస్తించాయి.పాపాలు తొలగిపోవటం నిజమైతే వాటిని తొలగించేది ఈ పైన చెప్పినవేవీ కాదు. అన్నింటికీ ఉమ్మడిగా నిలిచినా ఆ నమ్మకమే... సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ లాంటి మహా ప్రవక్త స్వయంగా చెప్పి విశ్వసించిన తర్వాత కూడా '' పాపాలు తొలగిపోవతం నిజమైతే " అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ పైన ఒక వాక్యం వ్రాసాను.అది వారి మాటను అవమానించటం కాదు గాని విశ్వాసం తోడుగా మీరు ముద్ధాడితేనే అది సాధ్యమని నా ఉద్దేశ్యం.

క్రైస్తవ సోదరుల పవిత్ర గ్రంధం పరిశీలించగా నాకు అందులో కనిపించిన అద్బుత వాక్యాలు రెండే.ఒకటి ప్రేమ. రెండు విశ్వాసం.నీవు నమ్మినట్లితే అలానే జరుగు గాక అని ప్రతిసారి యేసు ప్రభు చెప్పారు.వారు ఫలితం కూడా పొందారు.వారికి ఫలితం సమకూర్చింది యేసుప్రభు వరమని వారనుకుంటే,కాదు వారి విశ్వాసమే అని నేనంటాను.ఈ విషయానికి కూడా అయన అదే బైబిల్ లో నీటి పై నడిచే శిష్యుల ఉదాహరనగా తెలియజేసారు.

తద్వారా .. నేను చెప్పేది ఒక్కటే.సులభంగా దొరికే ఫలితానికి చులకనెక్కువ. ఇంట్లో కుర్చుని ఖురాన్ నో , బైబిల్ నో లేక భారత రామాయనాన్నో ముద్దాడినంతనే పాపాలు పోతాయని మన ప్రవక్తలు చెప్పున్డుంటే అది ఎంతమంది నమ్మే వారం.అందుకే మన ప్రవక్తలు మన విశ్వాసానికి ముడి ఎక్కడో ఇరుకులో పెట్టారు.ఎక్కడో ఎత్తులో పెట్టారు.అది ఎక్కాలనే ఆశ నీలో కనిగినప్పుడే నీ పాపాలను నీవు గుర్తించినట్టు.ఇక అన్ని కస్టాలు పడి అక్కడికి చేరవంటే నీ మనసున ఆ పాపలు తొలగినట్టే.

ఇక విగ్రహాలంటారా..అవి మన నమ్మకానికో కేంద్రం..మన విస్వసానికో ప్రతిరూపం..ఒక రకంగా అవి మనకవసరం.అనుకుంటే అనవసరమే .. కాని అనుకోలేము గనుకే అవసరం.విసిరితే రాయి తగులుతుంది.ఎక్కడ తగులుతుందో మాత్రం చెప్పలేము.గురి తెలియాలంటే అక్కడేదో ఒకటి తప్పదు.ఆ గురే ఈ గుడి.ఓ మనిషి చేసే మట్టి బొమ్మే దేవుడైతే. మరి ఆ దేవుడ్ని చేసిన ఆ మనిషినేమనాలి?అనటం మాట అటుంచి అనుకోనైన అనుకోము అది ఓ బొమ్మని చేసిందో మనిషని... అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పెచే సాధనాలే ఈ హజ్రే యాత్రలు.అంతంత యత్నాలు.

విగ్రహారాధన తప్పు .. ఆ విగ్రహం లో నీవు ఆ దైవాన్ని చేరుకోగాలిగితే అంతకంటే ఇంకేముంది చెప్పు? పుజిచే విధానం తప్పైతే అదే అసలు ముప్పు...
తప్పుగా చెప్పుంటే ఆ సర్వేశ్వరుని తో పాటు మిమ్మల్ని కూడా క్షమించమని పెడుకుంటూ.

Ma Siddhique
'
హజ్రె అస్వధ్ ను తాకడం, చుంబించడం అనేవి హజ్జ్ లొ ఎంత మాత్రం బాగం కాదు. నిజానికి 5 శాతం హాజిలు కూడ జన సమ్మర్ధం వలన దీని వరకు చేర లెరు. పాపాలు తొలగించుకొవడనికె అలా చేస్తా రనుకొంటె ఇది  హజ్జ్ లొ విధి అయి వుండేది. ఇస్లాం మంచి వైపుకు నిరంతరం ప్రేరెపిస్తు నిరంతరం స్వర్గం యెక్క ఉహను ఉంచుతుంది.ఇస్లాం ప్రతీ మంచి పనికి ప్రతిపలం స్వర్గంతో ముడిపెడుతుంది.మనిషికి ఉన్న స్వర్గ కాంక్ష దాని పట్ల ప్రేమను జనింప చేస్తుంది. హజ్రె అస్వధ్ స్వర్గపు రాయి. స్వర్గం పట్ల ఉన్న ఆకాంక్ష దాని ముద్దాడేటట్లు చేస్తుంది. అంతే తప్ప అదేదొ మన పాపాల్ని పీల్చుకుంటుందనొ,స్వర్గం చేరుస్తుందనో కాదు.మనకు ఇష్టమైన వారి వస్తువుల్ని ఎలా ఇష్టపడతామొ ఇది అంతే! 
Noorbasha Rahamthulla Ma Siddhique భాయ్, Syed Abdus Salam గారు చెప్పిన కాబా విశిష్టతలు గ్రహించండి 1. "స్వర్గం నుండి దించబడిన ఈ రాయి ముందు పాలకన్నా తెల్లగా ఉండేది, తర్వాత మనిషి పాప మసితో నల్లబడింది." 2. ప్రదక్షిణ కేవలం కాబాకు మాత్రమే ప్రత్యేకం. ఇతర ప్రార్థ నాలయాల వద్ధ ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు.కాబాకి నేరుగా ఏడు ఆకాశాలపైన బైతుల్‌ మామూర్‌ ఉంది. దానిపైన స్వర్గం ఉంది. స్వర్గ శిఖర భాగమైన ఫిర్‌దౌస్‌ పైన అల్లాహ్‌ అర్ష్‌ ఉంది 3.మకామె ఇబ్రాహీమ్‌ అన్నది ఒక రాయి. ఇబ్రాహీమ్‌ ఆ రాతి మీదే నిలబడి కాబా గృహాన్ని నిర్మించారు. ఆ రాయిపై ఆయన పాద చిహ్నాలు కూడా ఉన్నాయి.4.కాబా గృహం గౌరవప్రదంగా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచం ఉంటుంది.5.అల్లాహ్‌, ఈ పట్టణాన్ని భూమ్యాకాశాలను పుట్టించిన నాటి నుండే పవిత్రంగా చేశాడు. మక్కా అంతటి పవిత్రత, గౌరవం మరి దేనికీ లేదు. 6.''ఓ మక్కా! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. నీవు అల్లాహ్‌ భూభాగాలన్నింటిలోకెల్లా అత్యంత మహిమాన్వితమైన నేలవు. భూభాగాలన్నింటిలోకెల్లా అల్లాహ్‌కు అత్యంత ప్రియ మైన భూభాగానివి. మక్కా వాసులే గనక నన్ను నీ నుండి వెలివేసి ఉండక పోతే నేను ఎన్నటికీ నిన్ను వీడి వెళ్ళేవాడను కాను.7.ప్రవక్తలు తమ శేష జీవితాన్ని ఈ పట్టణంలో జీవించి కన్ను మూయాలని ఆశ పడ్డారు. మక్కా వెళ్ళే వారు అక్కడే మర ణించాలని, అక్కడ మరణం రావడం తమ భాగ్యమని బయలుదేరతారు.భూ ఇతర భాగాలు మనిషిని పదార్థ పూజారిగా, దానవుడిగా మార్చితే, మక్కా పురం మనిషిని పరమాత్మదాసుడిగా, మనసున్న మనీషిగా తీర్చిదిద్దుతుంది.


Shaik Riyaz నూర్ బాషా రహంతుల్లా గారు మీరు లేవనెత్తే సందేహాత్మకమైన అంశాల వలన అందరికి చాలా లాభం కలుగుతోందని నేననుకుంటున్నాను. ఎన్నో విషయాలు చర్చలోనికి వస్తున్నాయి.ఎందరివో అభిప్రాయాలు ముందుకొస్తున్నాయి.ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి, నిస్పక్షపాతంగా సత్యాన్ని అన్వేషించేవారి కొరకు ఇది చాలా లాభదాయకమైనది. ధన్యవాదాలు సార్.
*సర్వ స్థోస్త్రాలు,సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్(అధ్వితీయ ఆరాధ్యుడు) కే చెందుతాయి.ఇస్లాం లో సందేహాలన్నింటికి సమాధానాలున్నాయి. అయితే మనకు సంపూర్ణ జ్ఞానం లేనందువల్ల, ఎన్నో విషయాలు సందేహాలుగానే ఉంటాయి.కొన్ని సందేహాలు ధర్మం గురించి తెలుసుకోకపోవటం వలన, వాటి యొక్క గ్రంధాల పూర్తి జ్ఞానం లేకపోవడం వలన సమాధానాలు తెలుసుకోలేక పోతాము,కొన్ని సందేహాలు ప్రస్తుతం మనిషి యొక్క జ్ఞాన పరిధిలోనికి రానివి.
*హజ్రత్ ఇబ్నే అబ్బాస్ (రజి) కథనం దైవప్రవక్త(సల్లం) ఇలా సెలవిచ్చారు :” హజ్రెఅస్వద్ స్వర్గపు రాయి.ఆది ముందు పాల కన్నా తెల్లగా ఉండేది,ఆదం సంతానం యొక్క పాపాల వల్ల అది నల్లగా మారి పోయింది.” (తిర్మిజీ ;877)
* హజ్జ్ మరియు ఉమ్రాలకు పోయేవారు దానిని ముట్టుకుంటార
ు(చుంబిస్తారు) దీనిలో ఎటువంటి సందేహంలేదు,ఉండకూడదు కూడా. ఎందుకంటె! దైవ ప్రవక్త(స) ఆచరించారు గనక.
“హజ్రెఅస్వద్ కు బిస్మిల్లహి అల్లాహు అక్బర్ అంటూ చుమ్బించాలి. చుంబించే అవకాశం లేకపోతె చేత్తో దాన్ని తాకాలి.అదీ కుదరకపోతే దానికి చెయ్యి చూపించి ఆ చెయ్యికి ముద్దు పెట్టుకోవాలి.(బుఖారీ,ముస్లిం).
*ఇక మీరన్నట్టు మంచి,చెడులు-లాభ,నష్టాలు కలిగించలేని ఒక రాయి అయితే ప్రవక్త ఎందుకు ముద్దు పెట్టుకుంటారు.
ముందు మంచి,చెడుల-లాభ,నష్టాల గురించి తెలుసుకుందాం: హజ్రెఅస్వద్ తను స్వతహాగా లాభ,నష్టాలను కలిగిఉందా? హజ్రత్ ఉమర్(రజి)గారి హదీసు లో కూడా హజ్రెఅస్వద్ తను
స్వతహాగా లాభ,నష్టాలు కలిగి లేదనేదే దాని భావం.
హజ్రెఅస్వద్ ను సృష్టించిన సృష్టికర్త యొక్క ఆజ్ఞ మేరకు దానిని ముద్దుపెట్టుకుంటే లేదా ముట్టుకుంటే పాపాలు మన్నించ బడతాయి అనేది భావం. హజ్రెఅస్వద్ ను ముద్దు పెట్టుకుంటే తను స్వతహాగా పాపాలు మన్నించదు కదా.
దాన్ని ముద్దు పెట్టుకుంటే పాపాలు మన్నించబడతాయని దానికే ఆరాధించి,పూజించరు కదా..అదే దైవం కాదు కదా...
ప్రవక్త ముహమ్మద్(స) అరాఫత్ లో బస చేసి వేడుకునేవారి పాపాలను దేవుడు మన్నిస్తాడు అని శెలవిచ్చారు.అంతమాత్రాన అరాఫాత్ దైవం కాలేదు కదా,తను స్వతహాగా పాపాలను మన్నించదు కదా,దైవాజ్ఞకు కట్టుబడి,దైవప్రవక్త(స)గారి విధానాన్ని పాటిస్తే దానికి ఫలం లభిస్తుంది.
అదే విధం
గా ప్రవక్త(స) ఒంటరిగా చేసే నమాజుకన్నా,మసీదులో చేసే నమాజుకి 27 రెట్లు పుణ్యం ఎక్కువ అని శెలవిచ్చారు.అంత మాత్రాన మసీదు దైవం కాలేదు కదా,తను స్వతహాగా పుణ్యాలు ఇవ్వలేదు కదా. అదేవిధంగా హజ్రెఅస్వద్ ను కూడా భావించాలి.
*ఇక ప్రవక్త(స) హజ్రెఅస్వద్ నుఎందుకు ముద్దుపెట్టుకున్నారు అంటే, హజ్జ్ లోని భాగాలైన మీనా,ముజ్దలిఫా,అరాఫత్ లలోకూడా గడిపారు ఎందుకు ఇలాచేశారు అంటే,దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు.ఎందుకంటె దీని గురించిన జ్ఞానం ఎవరికీ లేదు.అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు తప్ప.అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త(స)చేశారు,తన సహచరులను కూడా ఇదేవిధంగా హజ్జ్ చెయ్యండి అని ఆజ్ఞాపించారు.ఇక అలా మనమెందుకు చెయ్యాలంటే! “విశ్వాసులారా!అల్లాహ్ కు ,ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంతా వింటూనే అతని(విధేయత)పట్ల విముఖులు కాకండి.” (దివ్య కుర్ఆన్ 8:20)
*భక్తీ భావన లేకుండానే హజ్రెఅస్వద్ ను ముద్దుపెట్టుకోవటం అనే ఆచారం వల్ల కలిగే ప్రయోజనం :” అదే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స) కు విధేయత పాటించడం.”
*ఇక చివరి విషయమేమంటే..సోదరులు సిద్దీఖ్ గారు చెప్పినట్లు.హజ్రెఅస్వద్ కు ముద్దు పెట్టడం హజ్జ్ లోని భాగం కాదు. దానిని ముద్దు పెట్టకున్నా హజ్జ్ అయిపోతుంది.హజ్జులో ఎటువంటి లోపం ఉండదు. ఇక దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి,హజ్రెఅస్వద్ ఆరాధనలో ఏపాటిదో.....
Noorbasha Rahamthulla నాకు అభ్యంతరాలు ఏమీ లేవు.తెల్లగా ఉండే రాయి మనిషి పాప మసితో నల్లబడింది అంటే మనిషి లోని పాప మలినం పీల్చుకుంటుందా అని అవగాహనకోసమే అడిగాను.
Ma Siddhique పాప కాలుష్యం వలన రాయి నలుపు మారొచ్చు, కాని పాప హరణం బరొస ఎక్కడ ప్రస్తావనకు రాలేదు.వాస్తవానికి అరబీ భాషలో హజర్ అంటే రాయి, అస్వధ్ అంటే నలుపు. ఆది ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలొ కాబ గొడలొ ప్రతిష్టించేటపుడే అది నల్లగ ఉంది. అందుకే దాన్ని నల్ల రాయి అన్నారు.

Noorbasha Rahamthulla మొదటినుంచీ అది నల్ల రాయే అని మీరంటున్నారు.కానీ Shaik Riyaz పేర్కొన్న హదీసు ఇంకో రకంగా ఉంది."హజ్రెఅస్వద్ స్వర్గపు రాయి.ఆది ముందు పాల కన్నా తెల్లగా ఉండేది,ఆదం సంతానం యొక్క పాపాల వల్ల అది నల్లగా మారి పోయింది.” (తిర్మిజీ ;877).కాబా గోడలో దానిని పెట్టేనాటికే మనుషుల పాపాల వల్ల నల్లగా మారిపోయిందంటే ఆరాయికి పాపాలను పీల్చే గుణమో లేక పాపాలకు ప్రభావితమై రంగు కోల్పోయే గుణమో ఉండి ఉండాలికదా అని నా అనుమానం.

Ma Siddhique అవును ఆ రాయి ఆదం (అ) కాలం నాటిది బహుశ అప్పుడు తెల్లగ ఉండి ఉండ వచ్చు.
అయిన పాప హరణనికి పాశ్చత్తపమే సాదనం కాని మరేది కాదు. దేవూనికి అత్యంత చేరువ స్థలం సజ్దా (సాష్టంగ పడడటం).అక్కడ చేసే పాశ్చత్తపం ఉత్తమమైనది. పాప కాలుష్యం వలన రాయి నలుపు మారొచ్చు, కాని పాప హరణం బరొస ఎక్కడ ప్రస్తావనకు రాలేదు.
 
Noorbasha Rahamthulla పాపహరణం కాదు. పాప శోషణం.
Noorbasha Rahamthulla ఓకే.ఆ రాయి పాపాలను హరించదు అని స్పష్టమయ్యింది.మానవ పాపాలు సోకి రంగు ఎలా మారింది అనే వివరమే కావాలి.

Ma Siddhique మనకు ఎంత వరకు తెలియ చేయబడిందొ అంత వరకే చెప్పగలం. చెట్టు పండు తింటే ఆదం హవ్వలకు నగ్నత్వం ఎలా తెలిసింది అంటే దానికి సమాదనం దొరకదు. బహుశ నేను ఇంతకు మించి మిమ్మల్ని సమాదానపర్చలెనేమో

Noorbasha Rahamthulla సరే.అంతా కలిసి బోలెడంత సమాచారం చేర్చారు.ధన్యవాదాలు.'మానవ పాపాలు సోకి రంగు ఎలా మారింది','చెట్టు పండు తింటే ఆదం హవ్వలకు నగ్నత్వం ఎలా తెలిసింది' లాంటి బేతాళ ప్రశ్నలకు ఇంకెవరన్నా జవాబు చెబుతారేమో ఎదురు చూద్దాం.

1 కామెంట్‌: