11, అక్టోబర్ 2013, శుక్రవారం

బురఖా,మహిళా ప్రవక్తలు

బురఖా,మహిళా ప్రవక్తలు
స్త్రీ ముఖం మరియు అరచేతులు తప్ప మిగతా శరీరం మొత్తం కప్పబడి ఉండాలి. ఇంతకు మునుపే ఈ విషయం తెలుపబడినది. అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ''బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదు...'' (నూర్‌ 31)
ఉమ్మె సలమ(ర) కథనం: ఏ స్త్రీ అయినా ఇజార్‌ లేకుండానే కేవలం చొక్కా మరియు వోణి ధరించి నమాజ్‌ చేయవచ్చా? అని దైవప్రవక్తను ప్రశ్నించగా ఆయన(స) ఇలా సమాధానమిచ్చారు: ''చొక్కా పొడువుగా ఆమె పాదాల వరకూ ఉంటే అప్పుడు చేయవచ్చు''. ( అబూదావూద్‌ 640)
 ముఖం తప్ప అని హదీసులో స్పష్టంగా ఉంది.ముఖాన్ని కూడా దాయటం ఎందుకు?
 Syed Abdus Salam sir mukhaniki sanbandhinchina parada varaku dharma panditulli bhinnabhipraayam undi. shaik albaani (r) gaaru mukhanni kappalsina avasaram ledannaru. pote paina perkonabadina hadeesu o saadharana aadesham. sthree yekaantamlo namaazu cheyaalanna paatinchalsina kaneesa aachchaadana. ika hajrat aayisha (r) gaari pravachanam prakaram - parai purushulu taarasa padagaane mukham kappukune vaallam ani undi. kaabatti poortigaa parada patinche vidhanam kottadi kaadu. nootana pokada antakanaa kaadu.
 Abdul Kareem Noorbasha Rahamthulla ati vaadam ani meeru elaa cheppagalaru .meru emaina pandithula???stri andam antha mukham lone untuntdi.meeru oka saari alochinchandi oka andamiana stree mukhaniki parda lekunda bayata kanipiste enta mandi choostaaru.hadeesulalo binnabhipraayalu unnappudu uttama maina daanini enchkovadam manchidi.
 Noorbasha Rahamthulla abdul kareem మీరేమన్నా పండితులా?నూర్‌ 31 ప్రకారం ముఖానికి మినహాయింపు ఉందని నా భావన.లేకపోతే ఖురాన్ హదీసుల్లో నుండి రిఫరెన్సులు ఉదహరించండి.ప్రవక్తలలో స్త్రీలు కూడా తక్కువే
పాత నిబంధన కాలంలో మిరియమ్ (నిర్గమ 15:20),దెబోరా (న్యాయా4"4), హల్దా (2రాజు 22:14), హన్నా (1సమూ 2:1) లాంటి స్త్రీలు ప్రవక్త లుగా ఉన్నారు.కొత్తనిబంధన కాలంలో అన్నా (లూకా 2:36) ,ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపో 21:8)ప్రవక్తలుగా ఎంఛబడ్డారు.ఇస్లాం లో మరియం తప్ప ఇంకెవరూ ప్రవక్త స్థాయికి ఎదగ లేదు.
 Abdul Kareem sir nenu panditunni kadu kabatte ativadam ani mithavaadam ani cheppaledu.నూర్‌ 31 ప్రకారం ముఖానికి మినహాయింపు gurinchi panditula madyana binnabhipraayalu unnayi.anduke nenu enchukune mundu uttamamaina abhiprayaanni enchukomannanu.ikapothe islam lo stree pravaktalu anto evaru leru.teliyaka pote evaraina pandithulanu adigi telusukondi.mariyam pravaktha ani evaru chepparu meeku??
 Noorbasha Rahamthulla కాదని మీకెవరు చెప్పారు?ముందు మర్యాదగా అడగటం నేర్చుకోండి.
 Abdul Kareem KSHAMINCHANDI SIR! QURAN &HADEES LALO EVIDENCE CHOOPINCHANDI CHALU.
 Noorbasha Rahamthulla ఆమె ప్రవక్త కాదని ముందు మీరూ ఖురాన్ హదీసుల సాక్ష్యం చూపించండి.కురాన్ హదీసులతో సహా ఇస్లాం సాహిత్యమంతా మా మాతృభాషలో దొరుకుతుండగా వేరే పండితులు ఎందుకు?మీరే స్వయంగా లేఖనాలలో వెదుక్కోవచ్చు.చూడండిః ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్" ను ప్రశంసిస్తాడు.ఇస్లాం మతం మర్యంని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. బైబిల్ కంటే ఖురాన్లోనే మరియ మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. ఈసా తల్లి మరియమ్.ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ.ఈమె ఇస్లామీయ ప్రవక్త .---"విశ్వ ప్రవక్తల జీవితచరిత్ర " అనే గ్రంధంలో డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు మరియంతో పాటు (1)షీత్ (2)యోషే బిన్ నూన్ (3) సమూయీల్ (4) ఉజైర్ లను కూడా ప్రవక్తల జాబితాలో చేర్చారు.ఇప్పుడు మన చర్చ మరియమ్మ గారి గురించి గనుక ఆమె గుణవిశేషాలు, ఆమెపై దైవం చూపిన ప్రేమాతిశయాలు ఎలాంటివో ఈ వాక్యాలలో చూడండిః
ఇమ్రాన్, హన్నా బిన్తె ఫాఖూజ్ అనే దావూద్ వంశ దంపతులకు పుట్టి బైతుల్ ముఖద్దస్ మస్జిద్ కి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. జకరియా ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి అల్లాహ్ వాక్యాలను ఉపదేశించాడు. అగోచర విషయాలు మరియమ్ కు అల్లాహ్ తెలియజేసినట్లు ఖురాన్ లోని ఆలె ఇమ్రాన్ :42-47 లో ఉంది. ఈమెకు స్వర్గ ఫలాలు కాలంకానికాలంలో కూడా ఆహారంగావచ్చాయి. దేవుని వాక్శక్తి ద్వారా గర్భవతియై ఈసా ప్రవక్తను కన్నది. ఈమె పేరుతో ఖురాన్ లో 19 వ సూరా కూడా ఉంది.
ఇమ్రాన్ వంశస్త్రీ "ప్రభూ నేను మగపిల్లవాడనుకుంటే ఆడపిల్లపుట్టింది.నేనీ పాపకు మర్యం అని పేరుపెట్టాను.ఈమెను ఈమె సంతానాన్ని షైతాన్ బారిన పడకుండా నీ రక్షణలో ఉంచుతున్నాను" అంది.అల్లాహ్ ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి చక్కగా పెంచి పోషించాడు.ఆమె సంరక్షకుడు జకరియ్యా ఆమె ప్రార్ధన గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్ధాలు ఉండేవి.ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది.(ఖురాన్ 3:36,37)
దేవదూతలు మర్యంతో "మర్యం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.నిన్ను పరిశుద్ధపరచాడు.సృష్టిలోని మహిళ లందరికంటే నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన సేవకోసం నియమించాడు" అన్నారు ..(ఖురాన్ 3:42,43)
దేవుని ఆత్మ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది(19:16,17)
ప్రజలు ఆమె శీలాన్ని శంకించారు (19:27,28)
పిల్లవాడు(ఈసా ) ఆమె తరుపున ఊయలనుండే తాను పరిశుద్ధుడనని మాట్లాడుతాడు (19:30-33)అల్లాహ్ సందేశాలను తెచ్చే జిబ్రాయీలు స్వయంగా ఆమె ముందు ప్రత్యక్షమై దైవ సందేశాన్ని వినిపిస్తాడు.ఇలాంటి అవకాశం ప్రవక్తలకు మాత్రమే ఉంటుంది. మరియం ఏ మగ ప్రవక్తలకూ తీసిపోని మహిళామణి.మహిళలను ప్రవక్తలు గా ఎందుకు ఒప్పుకోరు?
 Shaik Riyaz హజ్రత్ మర్యమ్ ను దేవుడు అత్యుత్తమ మహిళగా ఖరారు చేశాడు.అంటే ఆమె తన కాలంలో గల మహిళల్లోకెల్లా గొప్ప మహిళ అని భావం. ఎందుకంటె హజ్రత్ మర్యమ్ తో పాటు...హజ్రత్ ఖదీజా(ర.అన్హా)కు కూడా ఈ గౌరవపురస్కారం లభించినట్లు హదీసుల ద్వారా రూడీ అవుతోంది.హజ్రత్ ఖదీజా నుద్దేశించి " ఖైరున్నిసాయిహ"- మహిళలందరిలోకి ఉత్తమురాలు- అని హదీసులో ఉంది. మరికొన్ని హదీసుల్లో నలుగురు మహిళలను సంపూర్ణులుగా పేర్కొనటం జరిగింది....వారు: మర్యమ్, ఆసియా(ఫిరౌన్ భార్య), ఖదీజా, ఆయిషా(రజి)..." సరీద్" వంటకానికి ఇతర వంటకాలన్నింటిపై ఎలా ప్రాధాన్యత ఉందొ అలాగే హజ్రత్ ఆయిషా(రజి)కు మహిళలందరిపై శ్రేష్టత ఉంది అని మరో హదీసులో చెప్పబడింది.(ఇబ్నె కసీర్).....తిర్మిజీలలోని ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్(స)గారి పుత్రిక అయిన హజ్రత్ ఫాతిమా(ర.అన్హా)కు కూడా అత్యుత్తమశ్రేణి మహిళల సరసన స్థానం ఇవ్వబడింది.(ఇబ్నెకసీర్)
 
Abdul Kareem http://IslamHouse.com/402535
www.islamhouse.com
స్త్రీలలో నుండి ప్రవక్తలు మరియు సందేశహరులు ఎందుకు లేరు అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇక్కడ జవాబిచ్చారు. (తెలుగు)
Abdul Kareem assalamualikum Noorbasha Rahamthulla sir naa maatala valla mimmalni ibbandhi pedithe kshaminchandi.
  Noorbasha Rahamthulla అబ్దుల్ కరీం,మన నోటినుంచివచ్చే ప్రతిమాట మర్యాదకరంగా ఉండాలి.క్షమాపణ అడగటం,క్షమించటం ఆదర్శగుణాలు.
ఇక మీరు సూచించిన పై పుస్తకం లోని సారాంశం ఇదిః
"పురుషత్వం ప్రవక్తల లక్షణమని అల్లాహ్ నిశ్చయించాడు.ఓ ముహమ్మద్ నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే” [అల్ అంబియా 21:7].
పురుషులలో నుండి మాత్రమే సందేశహరులు ఎంచుకోబడినారు - స్త్రీలలో నుండి కాదు.నాయకత్వం వహించుట, యుద్ధములు చేయుట పురుషులకు తగును గానీ స్త్రీలకు కాదు.మహిళ సందేశహరుని బాధ్యత సరిగ్గా నిర్వహంచలేక పోవచ్చు,ఆమె ఆదేశాలకు ప్రజలు విధేయత చూపక పోవచ్చు.పురుషత్వం ఎక్కువ పరిపూర్ణమైంది.సందేశహరుల బాధ్యతను అల్లాహ్ స్త్రీలకు ఇవ్వకుండా, పురుషులకే అప్పగించినాడు:“పురుషులు స్త్రీల సంరక్షకులు మరియు పోషణకర్తలు”[అన్నిసా 4:34].
స్త్రీలలో వివేకం,ధార్మిక నిబద్ధత కొరత ఉంటుంది.బహిష్టు, గర్భధారణము, పిల్లలను కనడం , పురుటి రక్తస్రావం, పసిపిల్లల బాధ్యత లాంటి బాధలు స్త్రీలను సందేశహరుని పనులు చేయకుండా అడ్డుకుంటాయి. ప్రవక్త పదవిని నిర్వహించడం మహిళలకు సాధ్యం కాదు.మర్యం ప్రవక్త కాదు.మహిళా ప్రవక్తలు లేరు."

ఈ వాదనకు జవాబుః
అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ పురుషులే " We did not send before you except men whom we inspired"అని తప్పుగా అనువదించారు.( 21:7, 16:43).కానీ అది ప్రవక్తలుగా పంపబడ్డవారు స్త్రీలా పురుషులా అనే వివక్ష గురించి కాదు .మనుషులా దేవదూతలా అనే సందేహం గురించి.అహ్ లుజ్జిక్ర్ అంటే లేఖన పరిజ్ఞానం గలవారు. పంపబడ్డ ప్రవక్తలు జ్ఞానులైన మానవమాత్రులే కానీ దైవదూతలుకాదు"అని దాని భావం.
దీనిపై అబుల్ అలా మదూదీ ఏమన్నారో చూడండిః"whenever we raised any messengers before you ,they were no more than human beings" అనేది సరైన అనువాదం.అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ మానవులే అని ఉండాలి.స్త్రీలూ మానవులే కదా?

The objection consisted of pleading that a prophet is no more than any other human being.
ప్రవక్తపదవి మగాళ్ళకు మాత్రమే రిజర్వు చేసినట్లుగా ఖురాన్ హదీసుల్లో ఎక్కడా లేదు.స్త్రీకి కొన్ని బలహీనతలున్నంతమాత్రాన మహిళలు ప్రవక్తలుగా పనికిరారని అనటం ఎంతవరకు సబబు?అది పురుషాధిక్యతలోనుంచి పుట్టిన బుద్ధి అని స్త్రీలు గ్రహించరా?.స్త్రీలను చిన్నచూపుచూచే ఇలాంటి వ్యాఖ్యలను నాగరిక ముస్లిములు ఎందుకు అంగీకరించాలి?మహిళలను మగవాళ్ళతో సమానంగా అల్లానే గౌరవించాడు కాబట్టి ఆ దిశగా కదులుదాం.

 Abdul Kareem kshaminchinanduku danyavaadalu.[అల్ అంబియా 21:7] LO RIZAAL ANTE PURUSHUDU ANI ARDHAM .SAHI INTERNATIONAL QURAN TRANSLATION CHADAVANDI OKASARI.ALLAH MEEKU NAAKU UTTAMAMAINA JYANAANNI PRAASAADINCHUGAAKA.

 Mohd Yaqoob konni padawulanu kondare nirwahincha galaru....jaatula vyatirakatanu tattukowadam maguwala walla kaadu.....purushulamundu bahatamga waru tirugaleru...konni vishayalu ardham chesukovali....vadanalu shitan preranalani gurtinchali

 Noorbasha Rahamthulla Abdul Kareem ,Mohd Yaqoob రిజాల్ అనే పదాన్ని మౌదూదీ గారు,మలిక్ గారు,అబుల్ ఇర్ఫాన్ గారు కూడా 'మనుషులు' అనే అనువదించారు.ఆ అనువాదం సహేతుకంగా ఉంది.ఆ వాక్యం ఏ సందర్భంలో ఎందుకు వచ్చిందో చెప్పారు.ప్రవక్తలు మనుషులే కానీ దేవదూతలు కాదు అని సంశయ నివృత్తి చేయటం కోసం వచ్చింది.ప్రవక్తలంతా మానవమాత్రులేనని చాటింది.నీవూ మాలాంటి మానవుడవే,నిన్ను దైవప్రవక్త అని ఎలా నమ్మాలి? అని సందేహించిన మక్కా వారికి జవాబు ఇది.మళ్ళీ ఇంతమంచి సందేశంలో కూడా స్త్రీలా పురుషులా అనే వివక్ష చూపటం,అనుమానించటం ఆనాటి మక్కావాసులకు పట్టిన షైతాను ప్రేరణ లాంటిదేనని ఎందుకు అనుకోకూడదు?ఆకాశంలో సగం అని మనం పొగడుతున్న నారీమణులు ఈనాడు అంతరిక్షయాత్ర చేసివస్తున్నారు.యుద్దం చెయ్యటం కుదరదేమోగానీ,ప్రవక్త పని మాత్రం వాళ్ళ వల్ల అయ్యేపనే."విశ్వ ప్రవక్తల జీవితచరిత్ర " అనే గ్రంధంలో ఖురాన్ అనువాదకులు,పలు గ్రంధాల రచయిత డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు(ఫోన్.నంబరు 8500099138) లింగవివక్ష చూపకుండా మరియం గారిని ప్రవక్తగా పేర్కొనటం ముదావహం.