11, అక్టోబర్ 2013, శుక్రవారం

బురఖా,మహిళా ప్రవక్తలు

బురఖా,మహిళా ప్రవక్తలు
స్త్రీ ముఖం మరియు అరచేతులు తప్ప మిగతా శరీరం మొత్తం కప్పబడి ఉండాలి. ఇంతకు మునుపే ఈ విషయం తెలుపబడినది. అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ''బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదు...'' (నూర్‌ 31)
ఉమ్మె సలమ(ర) కథనం: ఏ స్త్రీ అయినా ఇజార్‌ లేకుండానే కేవలం చొక్కా మరియు వోణి ధరించి నమాజ్‌ చేయవచ్చా? అని దైవప్రవక్తను ప్రశ్నించగా ఆయన(స) ఇలా సమాధానమిచ్చారు: ''చొక్కా పొడువుగా ఆమె పాదాల వరకూ ఉంటే అప్పుడు చేయవచ్చు''. ( అబూదావూద్‌ 640)
 ముఖం తప్ప అని హదీసులో స్పష్టంగా ఉంది.ముఖాన్ని కూడా దాయటం ఎందుకు?
 Syed Abdus Salam sir mukhaniki sanbandhinchina parada varaku dharma panditulli bhinnabhipraayam undi. shaik albaani (r) gaaru mukhanni kappalsina avasaram ledannaru. pote paina perkonabadina hadeesu o saadharana aadesham. sthree yekaantamlo namaazu cheyaalanna paatinchalsina kaneesa aachchaadana. ika hajrat aayisha (r) gaari pravachanam prakaram - parai purushulu taarasa padagaane mukham kappukune vaallam ani undi. kaabatti poortigaa parada patinche vidhanam kottadi kaadu. nootana pokada antakanaa kaadu.
 Abdul Kareem Noorbasha Rahamthulla ati vaadam ani meeru elaa cheppagalaru .meru emaina pandithula???stri andam antha mukham lone untuntdi.meeru oka saari alochinchandi oka andamiana stree mukhaniki parda lekunda bayata kanipiste enta mandi choostaaru.hadeesulalo binnabhipraayalu unnappudu uttama maina daanini enchkovadam manchidi.
 Noorbasha Rahamthulla abdul kareem మీరేమన్నా పండితులా?నూర్‌ 31 ప్రకారం ముఖానికి మినహాయింపు ఉందని నా భావన.లేకపోతే ఖురాన్ హదీసుల్లో నుండి రిఫరెన్సులు ఉదహరించండి.ప్రవక్తలలో స్త్రీలు కూడా తక్కువే
పాత నిబంధన కాలంలో మిరియమ్ (నిర్గమ 15:20),దెబోరా (న్యాయా4"4), హల్దా (2రాజు 22:14), హన్నా (1సమూ 2:1) లాంటి స్త్రీలు ప్రవక్త లుగా ఉన్నారు.కొత్తనిబంధన కాలంలో అన్నా (లూకా 2:36) ,ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపో 21:8)ప్రవక్తలుగా ఎంఛబడ్డారు.ఇస్లాం లో మరియం తప్ప ఇంకెవరూ ప్రవక్త స్థాయికి ఎదగ లేదు.
 Abdul Kareem sir nenu panditunni kadu kabatte ativadam ani mithavaadam ani cheppaledu.నూర్‌ 31 ప్రకారం ముఖానికి మినహాయింపు gurinchi panditula madyana binnabhipraayalu unnayi.anduke nenu enchukune mundu uttamamaina abhiprayaanni enchukomannanu.ikapothe islam lo stree pravaktalu anto evaru leru.teliyaka pote evaraina pandithulanu adigi telusukondi.mariyam pravaktha ani evaru chepparu meeku??
 Noorbasha Rahamthulla కాదని మీకెవరు చెప్పారు?ముందు మర్యాదగా అడగటం నేర్చుకోండి.
 Abdul Kareem KSHAMINCHANDI SIR! QURAN &HADEES LALO EVIDENCE CHOOPINCHANDI CHALU.
 Noorbasha Rahamthulla ఆమె ప్రవక్త కాదని ముందు మీరూ ఖురాన్ హదీసుల సాక్ష్యం చూపించండి.కురాన్ హదీసులతో సహా ఇస్లాం సాహిత్యమంతా మా మాతృభాషలో దొరుకుతుండగా వేరే పండితులు ఎందుకు?మీరే స్వయంగా లేఖనాలలో వెదుక్కోవచ్చు.చూడండిః ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్" ను ప్రశంసిస్తాడు.ఇస్లాం మతం మర్యంని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. బైబిల్ కంటే ఖురాన్లోనే మరియ మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. ఈసా తల్లి మరియమ్.ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ.ఈమె ఇస్లామీయ ప్రవక్త .---"విశ్వ ప్రవక్తల జీవితచరిత్ర " అనే గ్రంధంలో డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు మరియంతో పాటు (1)షీత్ (2)యోషే బిన్ నూన్ (3) సమూయీల్ (4) ఉజైర్ లను కూడా ప్రవక్తల జాబితాలో చేర్చారు.ఇప్పుడు మన చర్చ మరియమ్మ గారి గురించి గనుక ఆమె గుణవిశేషాలు, ఆమెపై దైవం చూపిన ప్రేమాతిశయాలు ఎలాంటివో ఈ వాక్యాలలో చూడండిః
ఇమ్రాన్, హన్నా బిన్తె ఫాఖూజ్ అనే దావూద్ వంశ దంపతులకు పుట్టి బైతుల్ ముఖద్దస్ మస్జిద్ కి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. జకరియా ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి అల్లాహ్ వాక్యాలను ఉపదేశించాడు. అగోచర విషయాలు మరియమ్ కు అల్లాహ్ తెలియజేసినట్లు ఖురాన్ లోని ఆలె ఇమ్రాన్ :42-47 లో ఉంది. ఈమెకు స్వర్గ ఫలాలు కాలంకానికాలంలో కూడా ఆహారంగావచ్చాయి. దేవుని వాక్శక్తి ద్వారా గర్భవతియై ఈసా ప్రవక్తను కన్నది. ఈమె పేరుతో ఖురాన్ లో 19 వ సూరా కూడా ఉంది.
ఇమ్రాన్ వంశస్త్రీ "ప్రభూ నేను మగపిల్లవాడనుకుంటే ఆడపిల్లపుట్టింది.నేనీ పాపకు మర్యం అని పేరుపెట్టాను.ఈమెను ఈమె సంతానాన్ని షైతాన్ బారిన పడకుండా నీ రక్షణలో ఉంచుతున్నాను" అంది.అల్లాహ్ ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి చక్కగా పెంచి పోషించాడు.ఆమె సంరక్షకుడు జకరియ్యా ఆమె ప్రార్ధన గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్ధాలు ఉండేవి.ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది.(ఖురాన్ 3:36,37)
దేవదూతలు మర్యంతో "మర్యం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.నిన్ను పరిశుద్ధపరచాడు.సృష్టిలోని మహిళ లందరికంటే నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన సేవకోసం నియమించాడు" అన్నారు ..(ఖురాన్ 3:42,43)
దేవుని ఆత్మ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది(19:16,17)
ప్రజలు ఆమె శీలాన్ని శంకించారు (19:27,28)
పిల్లవాడు(ఈసా ) ఆమె తరుపున ఊయలనుండే తాను పరిశుద్ధుడనని మాట్లాడుతాడు (19:30-33)అల్లాహ్ సందేశాలను తెచ్చే జిబ్రాయీలు స్వయంగా ఆమె ముందు ప్రత్యక్షమై దైవ సందేశాన్ని వినిపిస్తాడు.ఇలాంటి అవకాశం ప్రవక్తలకు మాత్రమే ఉంటుంది. మరియం ఏ మగ ప్రవక్తలకూ తీసిపోని మహిళామణి.మహిళలను ప్రవక్తలు గా ఎందుకు ఒప్పుకోరు?
 Shaik Riyaz హజ్రత్ మర్యమ్ ను దేవుడు అత్యుత్తమ మహిళగా ఖరారు చేశాడు.అంటే ఆమె తన కాలంలో గల మహిళల్లోకెల్లా గొప్ప మహిళ అని భావం. ఎందుకంటె హజ్రత్ మర్యమ్ తో పాటు...హజ్రత్ ఖదీజా(ర.అన్హా)కు కూడా ఈ గౌరవపురస్కారం లభించినట్లు హదీసుల ద్వారా రూడీ అవుతోంది.హజ్రత్ ఖదీజా నుద్దేశించి " ఖైరున్నిసాయిహ"- మహిళలందరిలోకి ఉత్తమురాలు- అని హదీసులో ఉంది. మరికొన్ని హదీసుల్లో నలుగురు మహిళలను సంపూర్ణులుగా పేర్కొనటం జరిగింది....వారు: మర్యమ్, ఆసియా(ఫిరౌన్ భార్య), ఖదీజా, ఆయిషా(రజి)..." సరీద్" వంటకానికి ఇతర వంటకాలన్నింటిపై ఎలా ప్రాధాన్యత ఉందొ అలాగే హజ్రత్ ఆయిషా(రజి)కు మహిళలందరిపై శ్రేష్టత ఉంది అని మరో హదీసులో చెప్పబడింది.(ఇబ్నె కసీర్).....తిర్మిజీలలోని ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్(స)గారి పుత్రిక అయిన హజ్రత్ ఫాతిమా(ర.అన్హా)కు కూడా అత్యుత్తమశ్రేణి మహిళల సరసన స్థానం ఇవ్వబడింది.(ఇబ్నెకసీర్)
 
Abdul Kareem http://IslamHouse.com/402535
www.islamhouse.com
స్త్రీలలో నుండి ప్రవక్తలు మరియు సందేశహరులు ఎందుకు లేరు అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇక్కడ జవాబిచ్చారు. (తెలుగు)
Abdul Kareem assalamualikum Noorbasha Rahamthulla sir naa maatala valla mimmalni ibbandhi pedithe kshaminchandi.
  Noorbasha Rahamthulla అబ్దుల్ కరీం,మన నోటినుంచివచ్చే ప్రతిమాట మర్యాదకరంగా ఉండాలి.క్షమాపణ అడగటం,క్షమించటం ఆదర్శగుణాలు.
ఇక మీరు సూచించిన పై పుస్తకం లోని సారాంశం ఇదిః
"పురుషత్వం ప్రవక్తల లక్షణమని అల్లాహ్ నిశ్చయించాడు.ఓ ముహమ్మద్ నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే” [అల్ అంబియా 21:7].
పురుషులలో నుండి మాత్రమే సందేశహరులు ఎంచుకోబడినారు - స్త్రీలలో నుండి కాదు.నాయకత్వం వహించుట, యుద్ధములు చేయుట పురుషులకు తగును గానీ స్త్రీలకు కాదు.మహిళ సందేశహరుని బాధ్యత సరిగ్గా నిర్వహంచలేక పోవచ్చు,ఆమె ఆదేశాలకు ప్రజలు విధేయత చూపక పోవచ్చు.పురుషత్వం ఎక్కువ పరిపూర్ణమైంది.సందేశహరుల బాధ్యతను అల్లాహ్ స్త్రీలకు ఇవ్వకుండా, పురుషులకే అప్పగించినాడు:“పురుషులు స్త్రీల సంరక్షకులు మరియు పోషణకర్తలు”[అన్నిసా 4:34].
స్త్రీలలో వివేకం,ధార్మిక నిబద్ధత కొరత ఉంటుంది.బహిష్టు, గర్భధారణము, పిల్లలను కనడం , పురుటి రక్తస్రావం, పసిపిల్లల బాధ్యత లాంటి బాధలు స్త్రీలను సందేశహరుని పనులు చేయకుండా అడ్డుకుంటాయి. ప్రవక్త పదవిని నిర్వహించడం మహిళలకు సాధ్యం కాదు.మర్యం ప్రవక్త కాదు.మహిళా ప్రవక్తలు లేరు."

ఈ వాదనకు జవాబుః
అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ పురుషులే " We did not send before you except men whom we inspired"అని తప్పుగా అనువదించారు.( 21:7, 16:43).కానీ అది ప్రవక్తలుగా పంపబడ్డవారు స్త్రీలా పురుషులా అనే వివక్ష గురించి కాదు .మనుషులా దేవదూతలా అనే సందేహం గురించి.అహ్ లుజ్జిక్ర్ అంటే లేఖన పరిజ్ఞానం గలవారు. పంపబడ్డ ప్రవక్తలు జ్ఞానులైన మానవమాత్రులే కానీ దైవదూతలుకాదు"అని దాని భావం.
దీనిపై అబుల్ అలా మదూదీ ఏమన్నారో చూడండిః"whenever we raised any messengers before you ,they were no more than human beings" అనేది సరైన అనువాదం.అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ మానవులే అని ఉండాలి.స్త్రీలూ మానవులే కదా?

The objection consisted of pleading that a prophet is no more than any other human being.
ప్రవక్తపదవి మగాళ్ళకు మాత్రమే రిజర్వు చేసినట్లుగా ఖురాన్ హదీసుల్లో ఎక్కడా లేదు.స్త్రీకి కొన్ని బలహీనతలున్నంతమాత్రాన మహిళలు ప్రవక్తలుగా పనికిరారని అనటం ఎంతవరకు సబబు?అది పురుషాధిక్యతలోనుంచి పుట్టిన బుద్ధి అని స్త్రీలు గ్రహించరా?.స్త్రీలను చిన్నచూపుచూచే ఇలాంటి వ్యాఖ్యలను నాగరిక ముస్లిములు ఎందుకు అంగీకరించాలి?మహిళలను మగవాళ్ళతో సమానంగా అల్లానే గౌరవించాడు కాబట్టి ఆ దిశగా కదులుదాం.

 Abdul Kareem kshaminchinanduku danyavaadalu.[అల్ అంబియా 21:7] LO RIZAAL ANTE PURUSHUDU ANI ARDHAM .SAHI INTERNATIONAL QURAN TRANSLATION CHADAVANDI OKASARI.ALLAH MEEKU NAAKU UTTAMAMAINA JYANAANNI PRAASAADINCHUGAAKA.

 Mohd Yaqoob konni padawulanu kondare nirwahincha galaru....jaatula vyatirakatanu tattukowadam maguwala walla kaadu.....purushulamundu bahatamga waru tirugaleru...konni vishayalu ardham chesukovali....vadanalu shitan preranalani gurtinchali

 Noorbasha Rahamthulla Abdul Kareem ,Mohd Yaqoob రిజాల్ అనే పదాన్ని మౌదూదీ గారు,మలిక్ గారు,అబుల్ ఇర్ఫాన్ గారు కూడా 'మనుషులు' అనే అనువదించారు.ఆ అనువాదం సహేతుకంగా ఉంది.ఆ వాక్యం ఏ సందర్భంలో ఎందుకు వచ్చిందో చెప్పారు.ప్రవక్తలు మనుషులే కానీ దేవదూతలు కాదు అని సంశయ నివృత్తి చేయటం కోసం వచ్చింది.ప్రవక్తలంతా మానవమాత్రులేనని చాటింది.నీవూ మాలాంటి మానవుడవే,నిన్ను దైవప్రవక్త అని ఎలా నమ్మాలి? అని సందేహించిన మక్కా వారికి జవాబు ఇది.మళ్ళీ ఇంతమంచి సందేశంలో కూడా స్త్రీలా పురుషులా అనే వివక్ష చూపటం,అనుమానించటం ఆనాటి మక్కావాసులకు పట్టిన షైతాను ప్రేరణ లాంటిదేనని ఎందుకు అనుకోకూడదు?ఆకాశంలో సగం అని మనం పొగడుతున్న నారీమణులు ఈనాడు అంతరిక్షయాత్ర చేసివస్తున్నారు.యుద్దం చెయ్యటం కుదరదేమోగానీ,ప్రవక్త పని మాత్రం వాళ్ళ వల్ల అయ్యేపనే."విశ్వ ప్రవక్తల జీవితచరిత్ర " అనే గ్రంధంలో ఖురాన్ అనువాదకులు,పలు గ్రంధాల రచయిత డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ గారు(ఫోన్.నంబరు 8500099138) లింగవివక్ష చూపకుండా మరియం గారిని ప్రవక్తగా పేర్కొనటం ముదావహం.
 

30, ఆగస్టు 2013, శుక్రవారం

మత సామరస్యం



మత సామరస్యం

భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగానే ఆధ్యాత్మిక లోకంలో కూడా రెండు సూపర్ పవర్లు ఉన్నాయి. అవి ఏవంటే ఒకటి దేవుడు, రెండోది దెయ్యం.    ఒకరు అల్లా, రెండో వారు సైతాను.వీళ్ళిద్దరూ మొదటి నుండీ ఈ సృష్టి మీద ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నారు.ఆ పోరాటంలో మనుషుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. వాళ్ళను గురించి ఈ మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు మంచికోసం ఉంటే, సైతాను చెడుకోసం ఉన్నాడని, మంచిని ప్రచారం చేసే        దేవునికి విరుద్ధంగా సైతాను కూడా చెడును ప్రచారం చేస్తాడు.అయితే  ఇద్దరు కూడా మనుషుల ద్వారానే మనుషులకు బోధిస్తారు.దేవుడు గతంలో అనేక మంది ప్రవక్తలను ఆవేశించి తన గ్రంథాలను అన్నీ మతాల మనుషులకు సరఫరా చేశాడు. వాటిలో పవిత్ర ఖురాను ఒకటి. అందులో ఏమి ఉందంటే "భక్తులు కోపాన్ని దిగమింగేవారు. ఇతరుల తప్పల్ని క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం (3:1:34). చెడును, మంచితో, మేలుతో ఎదుర్కొనండి. అలా చేస్తే మీ విరోధులు మీకు మిత్రులైపోతారు".

        ఈ మాటల్ని దృష్టిలో ఉంచుకునే హజ్రత్ అలీ తనను పరాభవించిన వాడిని కూడా ఏమీ అనకుండా విడిచిపెట్టాడు. హజరత్ అలీ బిన్ హుసైన్ తనపై నీళ్ళ చెంబు దొర్లించిన పనిపిల్లకు విడుదల ప్రసాదిస్తాడు. హజరత్       అబూ హనీఫా అయితే తనను నడిరోడ్డులో పట్టుకుని నానా తిట్లూ తిట్టిన వాడికి డబ్బులిచ్చి సత్కరిస్తాడు. ఇలాంటి నీతుల్ని, ఆదర్శాలను చాటి        చెప్పిన మతం ఇస్లాం.అసలు ఇస్లాం అంటేనే 'శాంతి' అని అర్థము.

హిందూం ముస్లిం భాయీ భాయీ.
               
సెక్యులర్ విధానం అన్ని మతాల వారిని రక్షిస్తుంది. మెజారిటీ ప్రజలు ఒక మతానికి చెంది ఉన్నప్పుడు మైనారిటీలకు కొన్ని సమస్యలు రాకతప్పవు. అయితే వాటిని రాజ్యాంగానికి లోబడి, సామరస్య ధోరణిలోనే పరిష్కరించుకోవాలి.ప్రతి మతంలొ కొన్ని సుగుణాలుంటాయి అలాగే కొన్ని నచ్చని అంశాలూ వుంటాయి.రాజా రామ్మోహన రాయ్,కందుకూరి వీరేశలింగం లాంటి సంఘసంస్కర్తల కృషి వలన హిందూమతం ఎంతో బాగుపడింది.మన పూర్వీకులంతా హిందువులే.హిందు మతంలోని కుల వివక్షకు తట్టుకోలేక వేరే మతాలు స్వీకరించి ఉంటారు.ఎన్నో దురాచారాలను హిందుమతం వదులుకుంది కాని ఇంకా కుల వ్యవస్థ పోలేదు.అలాగే ముస్లిములలో
కూడాకట్నాలు,తెగలు,కులాలు,వడ్డీ,జూదము,త్రాగుడు,వ్యభిచారము,దొంగతనము,అబద్దాలు,హత్యలు,మొదటి భార్యను అడగకుండానే రెండోపెళ్ళి చేసుకోవడం,ఏకపక్షంగా విడాకులు ఇవ్వడం,బానిస స్త్రీలను వాడుకోవడం,మనసుతో పనిలేకుండానే తెలియని భాషలో యాంత్రికంగా ప్రార్ధన చెయ్యడం,కొడుకులు చూడకుండా విడిచిపెట్టిన ముసలి తల్లి దండ్రులకు వృధ్ధాశ్రమాలు కట్టకపోవడం,పేదరికంలో వుండి కూడా నారుపోసినవాడే నీరుపోస్తాడని యెక్కువ మంది పిల్లల్ని కని చదివించకుండా పనికిమాలిన వాళ్ళుగా తయారు చెయ్యడం లాంటి దురాచారాలు వున్నాయి.ముస్లిములందరిలొ కాదు కొందరిలో.అలాగని ఇస్లాం మతాన్ని తప్పు పట్టకూడదు కదా? ఇస్లాం యెన్నో దురాచారాలను నిర్మూలించింధి.అలాగే హిందు మతస్థుల్లో వున్న దురాచారాలను ఆ మతంలోని మహానుభావులే పొరాడి సంస్కరణలు తెచ్చారు తెస్తున్నారు ఇంకా తెస్తారు.
మంచితనం,మానవత్వం అనే సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించబడాల్సిందే."మంచి చెడ్డలు రెండే మతములు" అనే సూక్తికి తిరుగు లేదు.మంచి ఏ మతంలో వున్నా స్వీకరించుదాం.చెడు ఏ మతంలో వున్నా తిరస్కరించుదాం. మతాన్ని మారణకాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు నరకానికే పోతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. పరమేశ్వరుడైన దేవునికి ఆల్లాహ్,ఈశ్వర్,యెహోవా లాంటి పేర్లు మనిషి ఎన్ని పెట్టుకున్నా ఆ దేవునిలో వున్నంత ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం.హిందూం ముస్లిం భాయీ భాయీ.
ఇరు మతస్తులకు మనవి
ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది.అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని చేయద్దు.పూర్వం ఎవరో చేసిన  చెడ్డపనులు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే.ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడిపే వారికి వారి పూర్వీకులఅకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే.ముస్లిముల్లో శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు. అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా?ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా (తురకసాయిబులకు కూడా)ఎన్నోజన్మల పుణ్యఫలం అంటారు కదా.యుద్ధం అంటేనే నరబలి.హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు ఎప్పుడూ కష్టాలే మిగిల్చాయి.శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి. మానవత్వం,అహింస పరమ ధర్మాలు :

నేడు జీవిస్తున్న ఏ ఒక్కరికీ ఆనాటి దాడులతో సంబంధం లేదు. వారు కోరుకుని సాయిబులుగా పుట్టలేదు. పుట్టిన తరువాతే తెలిసింది ఈ జాతిలో పుట్టామని. నేటి సమాజంలో అందరూ కలిసిజీవించే వీలుంది. దానికేమైనా ఆటంకాలుంటే ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధంగా అన్ని హక్కులూ కల్పించాలి . ఎందుకంటే ఇలా మనిషి వేల ఏళ్ళ చరిత్రను తలుచుకుంటూ నేటి తరాలను ద్వేషభావనతో చూసే కంటే  నేటి పరిస్థితిని బట్టి నడుచుకుంటే బాగుంటుంది.నేడు ముస్లిముగా  పుట్టిన వాడి పూర్వీకులు వేయేళ్ళ  క్రితం ముస్లిములుగా  ఉన్నారో  లేదో తెలియదు. ప్రపంచంలో ఎవరూ కోరుకొని ఒకానొక కులంలోనో మతంలోనో  పుట్టరు,పుట్టలేరు. సంఘంలో ఎవరో కొందరు చేసిన దానికి మొత్తం జాతినే విద్వేషంగా చూస్తే గడిచిన చరిత్రకి, జరగబోయే చరిత్రకి తేడా ఏముంటుంది? నేర్చుకున్న గుణపాఠం ఏముంటుంది ?అంతా ఒక చక్రభ్రమణం లాగా విషవలయం లాగా ఉంది. కొన్ని తరాలపాటు ఒకరిపై విద్వేషం తరువాత ఆ తరాలు ఈ తరాలపై విద్వేషం. ఇంతేనా. గడిచిన వాటి నుంచి అనుభవాలు తెలుసుకుని జాగ్రత్త పడదాం.
ఆదిశంకరులు మనుష్యులంతా ఒక్కటే అని చెప్పలేదా? రాఘవేంద్రుడు, వీరబ్రహ్మేంద్రుడు అన్ని కులాలు మతాలు ఒక్కటే అని బోధించలేదా? చెప్పండి .ఆచరించకపోవడం మానవ తప్పిదం. దానికి మొత్తం జాతిపై ద్వేష భావం ఉంచుకోవడం తప్పు. ఒక్కడు దొంగైతే జాతి మొత్తాన్ని దొంగ అన్నట్లుంది ఇదంతా. ఏదేమైనా వేల సంవత్సరాల నాటి చరిత్ర చదివి ఒక జాతిపై ద్వేషభావనను వ్యక్తం చేయడం భావ్యం కాదు. ఎందుకంటే నేడున్న వారికి నాటి సంఘటనలతో సంబంధం లేదు.
తప్పులను దిద్దుకొని జీవించే అవకాశం ఒక్క మానవునికే సాధ్యం.
తెలివి ఉన్న జీవులం తప్పులను సరిదిద్దుకుని నేటి సమాజాన్ని మనమందరం సుఖంగా జీవించడానికి ముందుతరాలు ద్వేషభావనలు లేకుండా జాతి నిర్మాణం చేద్దాం. నేటి పీడితుడు రేపు పీడించేవాడిగా పుట్టవచ్చు లేక మొన్న పీడించినవాడు ఇప్పుడు పీడితునిగా పుట్టవచ్చు. ఎందుకంటే ఇది కర్మ భూమి. ఎవరు ఉందన్నా లేదన్నా కాదన్నా ఈ భూమిపై కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది. ముందు ఈ దేశాన్ని ప్రేమిద్దాం. మరణానికి  కులం మతం తేడా ఉండదు.అలా అనుకునే వేలాది ముస్లిములు ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ధన ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు.
వెనక్కు తీసుకురాలేని గతాన్ని తవ్వి తీయడంలో ఏమీ లాభం లేదు. ఈ నాటి సమాజంలో ఉన్న రుగ్మతల మీద చేతనైతే మీ వాగ్బాణాలనుఎక్కు పెట్టండి. దయచేసి ఇంకా విద్వేషాలను రేప వద్దు. మానవత్వం మంటగలపటానికి ఏ మతమైతే నేమి? హింసని మతం ఏం ఆపగలిగింది?మతాలవల్లనేర్చుకున్న మంచిని మరచి మనిషి హింసకు పాల్పడుతూనే ఉన్నాడు.పరలోక భయం కంటే మనిషికి మంచివాడిగా బ్రతకాలన్న బాధ్యత ముఖ్యం.మంచి అనేది మతం నేర్పితే తప్ప మనిషికి తెలియదా?మనిషి మరీ అంత అజ్నాని కాడు.మంచిమార్గాలన్నీ మతాలు మాత్రమే మనిషికి నేర్పుతున్నట్లైతే మతకలహాలు జరగకూడదు.కానీ మానవాళి చరిత్రలో ఎన్నోయుద్ధాలు,దేశ విభజనలూ మతాల కోసమే జరిగాయి.దుర్మార్గమే కావాలనుకునే వాడికి మతబోధలు హితవాక్యాలూ తలకెక్కవు.ప్రళయదినవర్ణనతో భయపెట్టిందిగానీ మతకలహాలను, నరబలులను మతం ఎప్పుడూ ఆపలేకపోయింది.మనిషి లోని దుర్గుణాలకు మతం కూడా పావు అయ్యింది.
మతాలలో కుచ్చితులుంటే మతాలకే చేటు.
"కులములోన నొకఁడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణముచేత వెలయు వనములోన మలయజమున్నట్లు.కులములోన నొకడు గుణహీనుడుండెనా కులము చెడును వాని గుణము వలన ఎలిమి చెరకునందు వెన్ను పుట్టినరీతి" అని వేమన ఏనాడో చెప్పాడు.
ప్రళయదినం అని ఇంకో రోజు అక్కరలేదు.ఇప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ పెద్ద ప్రళయాలే సృష్టిస్తున్నారు.అయినా ప్రళయదినం అనేది లేకపోతే శరణార్ధికి సహాయం చేయరా? రేపు దేవుడు వేస్తాడంటున్న శిక్షను మతాలపేరిట మానవత్వాన్ని మంటగలిపే వాళ్ళు ఇక్కడే వేసుకుంటున్నారు. దేవుడినే  లెక్కచెయ్యటంలేదు.మానవతావాది కులమత వివక్షలేకుండా ఏ మనిషి బాధకైనా స్పందించి సాయం చేయజూస్తాడు.
మనుషుల్ని చంపే వారికి విపరీతమైన స్వార్దమూ,పగతప్ప దేశభక్తి,దైవభక్తి రెండూ ఉండవు.దారినపోయే వాళ్ళను,వాళ్ళెవరో తమకే తెలియని అమాయకుల్నీ కేవలం ఫలానా వాళ్ళ వారసులనే ప్రతీకార వాంచతో అన్యాయంగా చంపేస్తారు.అమాయకుల్ని చంపే హంతకులకు అసలు మతం మీద విశ్వాసం ఉండదు.మానవత్వాన్ని వదిలేసిన ఉగ్రవాదులకు నరహంతకులకు నరకమే ప్రాప్తిస్తుందని మత లేఖనాలన్నీ చెబుతున్నాయి,చెప్పితీరాలి.ఉగ్రవాదుల దుర్మార్గం వలన మతంలోని మంచివాళ్ళు కూడా అవమానాలపాలౌతున్నారు.శాంతి,సామరస్యం ఉగ్రవాదులకు గిట్టవు.ఉగ్రవాదులకు మతం ఒక నటన మాత్రమే.హింసే వారి మతం.మరేమతంవారికి సమ్మతం కాదు.కేవలం మతం ముసుగులో మారణకాండలకు పాల్పడటం వారి ప్రవృత్తి.

మతమన్నది మానవాళికి హితమైనదైతే మనిషికి మంచి మార్గం చూపాలి కాని మారణ హోమానికి ముందుకు తోసేది కారాదు.శత్రువు కోసమైనా ప్రాణం పెట్టమనేదే మంచి మతం..ప్రాణం తియ్యమని చెప్పేది చెడ్డమతం.మతపిచ్చి ముదిరితే మనిషి మరింత నీతి నియమాలను సంతరించుకోవాలి.కానీ దుర్మార్గునిగా తీర్చిదిద్దుతోంది.ఏ పిచ్చితో మనిషిని చంపినా అది నరహత్యే.నేరమే.అసలు ఎవరు ఎవర్ని అయినా ఎందుకు చంపాలి?
 "మతపిచ్చే మారణ కాండలకు మూలం"
అన్ని మతాలను ఉగ్రవాదులు ఆక్రమించారు.మతాలలోని మంచివాళ్ళను నామమాత్రులుగాజేసి ఆయా మతాలకు అసలు ప్రతినిధులం మేమే అంటారు.మంచివాళ్ళ దగ్గర ఖురాను,గీత,బైబిళ్ళుంటే ఉగ్రవాదుల దగ్గర బాంబులు,కత్తులూ,తుపాకులూ ఉంటాయి.మారణాయుధాలు తమకు దుష్ట శిక్షణ కోసం,శిష్ట రక్షణ కోసం కావాలని , ధర్మసంస్థాపనకోసం ధర్మ యుద్ధం పేరుతో హత్యలు చేస్తున్నామంటారు.గుడులూ మసీదులూ కూలగొట్టి ఇహలోకంలో దేవుడిని  మేము రక్షిస్తే , పరలోకంలో దేవుడు మమ్మల్ని రక్షించి స్వర్గసుఖాలిస్తాడంటారు.

రావణుడు,హిట్లరు,లాడెను,సద్దాము,సూర్యకాంతం,దేవదాసు,లాంటి మంచి పేర్లు కూడా ఎవరూ పెట్టుకోరు ఎందుకని?తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లు తాగాడనే అన్నట్లు మతమంటే దుర్మార్గమే అనే స్థాయికి తెచ్చారీ ఉగ్రవాదులు.ఏ మతమైతేనేం చంపుకోటానికి? ఆద్యాత్మికవేత్తల ఉద్దేశాలు మంచివే అయినా వీరభక్తులు వారి మాట వినరు.దేవుడి పేరుతో మంచి కోసం అంటూ హింసా మార్గంలోకి ఆధ్యాత్మికవాదులనూ ఆహ్వానిస్తారు.రాజకీయంతో కలగలిసిన మతం మనుషుల్నీ మనసుల్నీచీల్చింది.

ఆధ్యాత్మికతకు ఆమడదూరంలో ఉండే రాజకీయమతాలకోసం ప్రపంచ సంపద వృధాగా ఖర్చవుతూ పేదరికాన్నీ పెంచింది.రాజకీయమతం ప్రజలమధ్య యుద్ధాలను రేపింది.పిచ్చిజనాలు ఇలాంటి రాజకీయమతాలకోసమే ప్రాణాలు తీసుకుంటున్నారు.ఇలా ఆధ్యాత్మికతను కోల్పోయిన రాజకీయమతాల వ్యవస్థ నీతి నిజయితీలకోసం ఎవరినీ కంట్రోలు చేయలేని స్థితికి దిగజారిపోయింది.ఈ పరిస్థితుల్లో మతం వదిలేస్తేనే మానవత్వం పరిఢవిల్లుతుందేమో అనిపిస్తుంటుంది.మతాచారాల పాటింపుకు, మతం విధించిన సంప్రదాయాలు నెరవేర్చేందుకు, తప్పనిసరిగా ఎంతోకొంత ఖర్చు ఉంటుంది. రాజకీయమతాల ఆధిక్యతా ప్రదర్శనలకైతే భారీ ఖర్చుతోపాటుహింస కూడా ఉంటుంది.వీటి వలన పేదప్రజలు మరింత పేదవాళ్ళయ్యే అవకాశాలుండొచ్చు.కానీ ఆద్యాత్మికతకూ కేవల భక్తికీ ఏ మాత్రం ఖర్చు ఉండదు.అందుకే "మతములన్నియు మాసిపోవును జ్నానమొక్కటే నిలిచి వెలుగును","మంచి చెడ్డలు రెండె మతములు" అన్న గురజాడ మాట బాట నేటికీ మంచివాళ్ళకు మార్గదర్శకంగా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో స్థానిక మసీదు లో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను పునర్జన్మను నమ్మరు.అదివిన్న ముల్లా గారు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు అన్నారు.
ఒక మతంలో తీవ్రవాదులుంటే వాళ్ళు తీవ్రవాదులుగా తయారుకావటానికి ఆ మతమే కారణమని నిందిస్తున్నారు.అన్ని మతాలలో తీవ్రవాదులున్నారు.అన్ని మతలేఖనాల్లోనూ యుద్ధాలూ,హింస ఉన్నాయి.ఎక్కడో సమతూకం తప్పింది.తమలపాకుతో నువ్వట్టంటే తలుపు చెక్కతో నేనిట్లంటా అంటూ దెబ్బకు దెబ్బ తీసుకుంటున్నారు కానీ ఎవరూ ఆగటంలేదు.ఒకసారి చెడుభావన కలిగితే మళ్ళీ సద్భావన కలగటం చాలా కష్టం.ఇరువర్గాలూ శాంతిబాట పట్టకుండా ఎగదోసే నాయకులు,నిప్పురాజేసే మేధావులూ సదా కాచుకుని ఉంటారు.మతంవల్ల తీవ్రవాదులు తయారవుతున్నారా?తీవ్రవాదులవల్ల మతం నిందలపాలౌతోందా? కోపం పాపకారణం అన్నారుకదా.ఏ మతంలోని కోపిష్టి అయినా తాను నిజమైన భక్తుడైతే పాపానికి పాల్పడకుండా కోపాన్ని దిగమింగాలి.మతాల పరమార్ధమైన మోక్షం లభించాలంటే ఈ ఓర్పు తప్పదు.
మతాలవల్లనే మనిషి చీలిపోతున్నాడా? మనిషి వల్లనే మతాలు చీలిపోతున్నాయా?స్వార్ధాన్ని మించిన మతం ఏముంటుంది? ఆకలి తీర్చేదే అసలైన మతం.అలాంటి మతం ఎక్కడా కానరాలేదు.నా కష్టం నేనే పడాలి.నా పోషణకు ఏ మాత్రం ఉపయోగపడని దాని తరుపున రెచ్చిపోయి వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం కంటే మత రహితునిగా మానవతావాదిగా ఏ మతమూ లేని మనిషిగా మిగిలిపోవటమే మంచిది.నీకిష్టమైతే అప్పుడు మనిద్దరిదీ ఒకే మతం అవుతుంది.అదే మానవ మతం.హెచ్చు తగ్గులు తెలుపుకుంటానికే మతాలు కులాలకు వంతపాడుతూ వాటి పేరుతో యుద్ధాలు చేసుకునేకంటే వాటిని వదిలెయ్యటమే మంచిది.
తెలుగునాట మనం మతాలు వేరైనా అక్క బావ లాంటి వరసలు పెట్టి పిలుచుకుంటున్నాం.ఒకరి అవసరాలకు ఒకరం ఉపయోగపడుతున్నాం.అంతా ఒక జాతిగా ఏకమై బ్రతుకుతున్నాం.జాతిని చీల్చే తొగాడియాలు,అక్బరుద్దీన్ లూ కొందరే ఉన్నారు.వాళ్ళ మాటలు వినొద్దు.ఉద్రేకపడి మానవత్వాన్ని విడువవద్దు.చావు బ్రతుకుల్లో ఒకరినొకరు కాపాడుకుందాం.కానీ ఎవడో హింసావాది చెప్పాడని రెచ్చిపోవద్దు.ఒకరినొకరు చంపుకోవద్దు.దైవాన్ని నిజంగా నమ్మేవాడెవడూ హత్య చెయ్యడు.ఇక్కడే శిక్ష పడకపోవచ్చు కానీ ఇతరులను నిష్కారణంగా బాధించేవాడు,హంతకుడు నరకంలోనన్నా పడతారు,లేదా మరుజన్మలో బాధితుడి కులంలోనో,హతుడి మతంలోనో పుట్టి మళ్ళీ బాధించబడతారు.పుట్టుకతో అన్ని మతాలలోని అందరు పిల్లలూ మంచివాళ్ళే.పెరిగేకొద్దీ తొగాడియాలూ అక్బరుద్దీన్లూ తయారౌతారు.మానవత్వమే మతోన్మాదులకు ఎక్కించాల్సిన మందు.మనందరం ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచికోసం శాంతిదాయకమైన సమాజం కోసం కృషి చేద్దాం.
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ చెప్పారు. కొల్హాపూర్‌ మహారాజు (హిందూ) తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు."భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం.--ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (సాక్షి 1.3.2010) ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?మన అందరి పూర్వీకులూ హిందువులే.మనం అన్ని మతాలనూ సమానంగా గౌరవించే మనసు తెచ్చుకోవాలి గానీ ఇంకొకరిమీద తమ సత్తా ఎందుకు చూపాలి?ఏం చేద్దామని చూపాలి? ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం.అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. హిందూ మతము ఆన్ని మతాల ఆలోచనా సరళులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇది ప్రజాస్వామిక, లౌకిక, స్వేచ్ఛాయుత మతము. ప్రకృతిలోని ప్రతి వస్తువునూ, జీవజాలమునూ ఆరాధించు తత్వము గలది. ఇందులో ఆస్తికులూ ,నాస్తికులూ కూడా స్వేచ్ఛ గా తమ భావ ప్రకటన చేయవచ్చు.ఈ కారణముగానే భారతదేశంలో హైందవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, యూదులు, పార్శీలు, క్రైస్తవులు,ముస్లిములు, బహాయీలు మున్నగు వారు స్వేచ్ఛగా మనగలుగుతున్నారు.
హిందూ ముస్లిములిద్దరూ ఈ దేశపు రెండు కళ్ళలాంటి వారు.ఒక కంటికి బాధ కలిగితే రెండో కన్ను బాధపడుతుంది అలాగే సంతోషం కూడా రెండు కళ్ళూ పంచుకుంటాయి.
మతములన్నియు మాసిపోవును జ్నానమొక్కటే నిలిచి వెలుగును
భారత దేశానికి గొప్ప సంగీతాన్ని అందించిన వారిలో నౌషాద్,మహమ్మద్ రఫీ,తలాత్ మహ్మూద్,షంషాద్ బేగం,లాంటి ఎందరో ముస్లిములు ఉన్నారు.ఖవ్వాలీ,గజల్స్ పండితులున్నారు.ప్రఖ్యాత సన్నాయి విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చిన మౌలానా,బుర్రకధ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ తెలుగు ముస్లిములే కదా .ఇస్లాం మతలేఖనాలు సంగీతానికి అనుకూలంగా లేవని ఈ ముస్లిములు ఆగిపోయి ఉంటే భారత రత్న బిస్మిల్లాఖాన్ తయారయ్యేవాడా?.
దుష్టుడికి దూరంగా ఉండమన్నారు.దుష్టుడు తిన్నగా ఉండడు.మంచివాళ్ళను బాధిస్తాడు.తనపాటికి తాను మర్యాదగా మంచిగా బ్రతికేవాడిపై దుష్టుడు దౌర్జన్యం చేసి దోచుకున్నా,అదేమని అడిగినందుకు తగాదా పెట్టుకొని దూషించినా, హానికితోడు అవమానం జరిగిందని మంచివాడే బాధపడుతున్నాడు.క్రూరజంతువులకు దూరంగా సాధుజంతువులు బ్రతుకుతున్నట్లు,క్రూరుడి బలానికి భయపడి సజ్జనులు దాక్కుని బ్రతకాలి.తప్పుకొని తిరగటం తమరక్షణ కోసమే తప్ప అన్యాయాన్ని ఆమోదించి కాదు.
మతసామరస్యానికి కొన్ని ఉదాహరణలు
* అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు అన్నారు పుట్టపర్తి శాయిబాబా.
 * షిర్డీ శాయిబాబా ఒక మసీదులో నివసించాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే).ఆ మసీదు ( ద్వారకామాయి) లోనే శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు.
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిములు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.ఆనాటి బ్రిటీష్ అధికారి సర్ థామస్ మన్రో సమర్పించిన మన్రో గంగాళం లోనే నేటికీ నైవేద్యం తెస్తున్నారు.(సాక్షి ఆదివారం అనుబందం 25.9.2011)
* "ప్రస్థాన త్రయం అంటే "భగవద్గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు " . అంతే కాదు " భగవద్గీత ,బైబిల్ ,ఖురాను కూడా" వివేకానందుడు
అన్ని మతముల సారమొకటే

"ఏదిహిందూ ఏది ముస్లిం
ఏది క్రైస్తవమూ?
ఎల్లమతముల సారమొకటే
తోటకెల్ల వసంతుడొకడే "
కృష్ణుడో క్రీస్తో ముహమ్మదో
గీతయో బైబిలు ఖురానో
ప్రేమనే బోధించలేదా?
ద్వేషమును నిరసించె కాదా?

తూర్పు పడమర బేధమేలా?
తోటకెల్ల వసంతుడొకడే
కరములెవరెటు మోడ్చి పిలిచిన
ఖంగుమని గుడిగంట ఒకటే  ---బోయి భీమన్న



A Muslim believes that faith is not complete when it is followed blindly or accepted unquestioningly. Man must build his faith on well-grounded convictions beyond any reasonable doubt and above uncertainty. Islam insures freedom to believe and forbids
compulsion in religion.

"Let there be no compulsion in religion.Truth stands out clear from error."Abu Daavood 1135
"There is no compulsion in religion." (Qur'an 2:256),26:4
Protection of the rights of non-Muslims to worship is an intrinsic part of Islamic law. "God does not forbid you, with regard to those who do not fight you for (your) faith nor drive you out of your homes, from dealing kindly and justly with them; for God loves those who are just." (Qur'an 60:8)

This is why non-Muslim societies and religious places of worship have flourished all over the Islamic world. History provides many examples of Muslims' tolerance towards other faiths. For instance, prior to the Spanish Inquisition, Jews and Christians lived and prosperred in Andalus (Spain) for centuries under Muslim rule.

Islamic law also permits non-Muslims to set up their own courts and implement family and personal laws administered by their chosen religious authorities.
Freedom of conscience is laid down by the Qur'an itself: "There is no compulsion in religion. Truth stands out clearly from falsehood; (Qur'an 2:256)

The life, honor and property of all citizens in a Muslim society are considered sacred whether the person is Muslim or not. Racism and sexism are incomprehensible to Muslims, for the Qur'an speaks of human equality:

"O mankind! We created you from a single soul, male and female, and made you into peoples and tribes, so that you may come to know one another. Truly, the most honored of you in God's sight is the greatest of you in piety. God is All-Knowing, All-Aware." (Qur'an 49:13)

"So be it an agreement between me and you. Whichever of the two terms I complete, let there be no compulsion on me.28:28
Shall we compel you to accept it when ye are averse to it?11:28

It was about this time that the Prophet granted to the monks of the Monastery of St. Catherine, near Mount Sinai, his liberal charter by which they secured for the Christians noble and generous privileges and immunities. He undertook himself, and enjoined his followers, to protect the Christians, to defend their churches and the residences of their priests and to guard them from all injuries. They were not to be unfairly taxed; no bishop was to be driven out of his diocese; no Christian was to be forced to reject his religion; no monk was to be expelled from his monastery; no pilgrim was to be stopped from his pilgrimage; nor were the Christian churches to be pulled down for the sake of building mosques or houses for the Muslims. Christian women married to Muslims were to enjoy their own religion and not to be subjected to compulsion or annoyance of any kind. If the Christians should stand in need of assistance for the repair of their churches or monasteries, or any other matter pertaining to their religion, the Muslims were to assist them.

In the conquest of non-Muslim countries by the Muslims, the population which did not embrace Islam were guaranteed life, liberty, and property and were called "Ah Al-Dhimma" or "Dhimmis" i.e. the People of the Covenant or Obligation. The Dhimmis were free to follow their religious practices but they were enjoined in their own interest not to carry such practices in any way offensive to the Muslims. The Christians were free to ring bells in their churches but in the interests of enmity between the two communities they were asked not to ring the bells at the time when the Muslims were offering prayers. The Christians were allowed to take out their crosses in processions but they were advised that such processions should avoid routes passing through settlements populated by Muslims. These restrictions did not in any way interfere with the liberty of the Dhimmis. మీ దారి మీది నా దారి నాది 10:41 

INTER RELIGIOUS MARRIAGES OF INDAN CELEBRITIES
1. Actor Irrfan Khan is married to Sutapa Sikdar, an Assamese Hindu. They have two sons, Babil and Ayaan
2.Legendary bollywood actress Rekha has four sisters. One of them, Radha Ganeshan is married to Mr Usman Syed and is settled in USA.
5. Music Director Anu (Anwar) Malik is married to Anju. They have two daughters, one of whom is named Anmol.
His elder brother Daboo Malik is married to Jyoti and has two sons, Amal and Arman.
6. Famous bollywood cabaret dancer of 80s, Leena Das married singer Mohammed Rafi’s son, Shahid. They have two sons.
8. Actor Zayed Khan recently married school friend Malaika Parekh, a Hindu. (His sister Suzanne is Hritik Roshan‘s wife. Other sister Simone is also married to a Hindu). They have two sons, Zidaan and Ariz.
12. VJ and anchor Mini Mathur is married to film director Kabir Khan. They have a son, Vivaan and a daughter, Sairah.
13. Actor Farooq Sheikh’s wife Rupa is a Gujarati Hindu. They have two daughters, Shaista and Sanaa.
15. Mira Nair, director of the film ‘Monsoon Wedding’ is married to Professor Mahmood Mamdani of Columbia University, a Ugandan Muslim. They have one son, Zohran.
19. Director Muzaffar Ali married Subhashini Sehgal, daughter of freedom fighter Capt Laxmi Sehgal. They later divorced.
20. Naina Balsawar, an ex- Miss India is married to Ahmad Dumpy, a Congress politician. She has been an MP herself. This is her second marriage. She has two daughters (Rivan and Rivka) from her first marriage, and a son, Azaan and a daughter, Aleah from Dumpy.
22. Imtiaz Ali, director of the film ‘Jab We Met’ is married to Priti. Their daughter is Ida.
24. Renowned Kathak dancer Sitara Devi married director K Asif (‘Mughal E Azam’). But they were divorced soon. Then she married Pratap Barot and divorced him too.
25. Singer Sunidhi Chauhan, at the age of 18, eloped and married Bobby Khan, brother of choreographer Ahmed Khan. Her family never acknowledged the marriage and threatened to disown her. The couple fell apart in a year and she returned to her parents. She is now married to a Hindu.
26. Late Sitar player Vilayat Khan was married to Bengali Brahmin, Monisha. They got divorced. Son Shujaat is a Sitar player married to a Muslim named Parveen and his son is Azaan.
27. His daughter Zila (sufi singer) is married to a Muslim while the other daughter Yaman married a Hindu Rajput (now divorced). Vilayat Khan’s second wife, was a Christian. From her. he had one son, Hidayat.
33. Actor-director Farhan Akhtar‘s first wife was Riya Jain. They are now divorced. He is now married to Adhuna Bhabani, a Bengali Hindu. They have two daughters, Shakya and Akira and a son, Kalyan.Javed Akhtar’s brother Salman is married to Monisha Nair. They both are psychologists based in UK.
34. TV actor and anchor Husain Kuwajerwala (Anchor of Indian Idol) is married to Tina Darera.
39. Latika, Daughter of Sheila Dixit, present Chief Minister of Delhi, is married to Mr Syed, a Muslim.
40. The household of Screen writer Salim Khan (of the Salim-Javed duo) is a virtual congregation of religions. He married Susheela, a Maharashtrian Hindu woman. Their children are actors Salman, Arbaaz and Sohail and a daughter named Alvira.
Arbaaz Khan married Malaika Arora (a Roman Catholic). They have a son named Arhan.
Actor Sohail Khan married Seema Sachdev, a Hindu. Their son is named Nirvaan.
Alvira is married to actor Atul Agnihotri, a Hindu. They have a daughter, Alizeb and a son, Ayaan.
Salim’s second wife is Helen, an Anglo-Indian Jew. They have an adopted Hindu daughter, Arpita.
43. CNN IBN anchorperson Suhasini Haidar daughter of politician Subramaniam Swamy, is married to Nadeem, son of  former India bureaucrat Salman Haidar. They have two daughters.
44. Aamir Khan maried Reena Dutta but they are now divorced. They had a son, Junaid and a daughter, Ira. Custody of the kids is with Reena. Aamir is now married to Kiran Rao. They have a son, Azad.
45. Bharatiya Janata Party’s Muslim faces, Late Sikander Bakht (married to Raj Sharma), Mukhtar Abbas Naqvi (married to Seema) and Syed Shahnawaz Husain (married to Renu Sharma) all married Hindu women.
46. Sarod Player Amjad Ali Khan married Subhalaxmi, an Assamese Hindu. Their twin sons Ayaan Ali and Amaan Ali are also Sarod players and frequently appear on TV. Ayaan recently got married to Neema, daughter of Romesh Sharma, producer of Big B film ‘Hum’. In the film, Romesh also did a small role of Kimi Katkar’s brother who gets killed.
50. Actor Arif Zakaria, known for his roles on TV and in art films, is married to journalist Namrata Sharma. They have a son.
51. India’s most famous radio anchor Ameen Sayani married Rama, a Kashmiri Pandit. Their son, Rajil is married to Krishna.
52. Actor Naseeruddin Shah is married to actor Ratna Pathak. They have a son, Imaad and a daughter, Heba. Both are actors.
53. ‘Wipro’ tycoon Azim Premji’s son Rishad got married to a Hindu girl, Aditi in 2005. They have two children, Rhea (daughter) and Rohan (son).
56. Music director Ismail Darbar (‘Devdas’, Hum Dil De Chuke Sanam’) is married to Priti Sinha (Ayesha after marriage).
58. Legendary actress Meena Kumari (Mahjabeen Bano) was daughter of Allah Bux and Prabhavati Devi (Iqbal Begum after conversion to Islam). Her mother, Prabhavati herself was daughter of a Christian father and a Hindu mother. Meena Kumari’s sister Mehelka (Madhuri after marriage) married Kishore Sharma.
61. Ghazal Singer Talat Aziz is married to Bina Adwani, a Sindhi Hindu. They have two sons, Adnan and Shayaan.
63. Actor Shahrukh Khan married Gauri Chibber. They have a son, Aryan and a daughter, Suhana.
66. ‘Indian Cowboy’ Feroze Khan married Sundari. She is the sister of actor Sonia Sahani who played Rishi Kapur’s mother in ‘Bobby’. They got divorced in 1985. Their children, Fardeen and Laila  both married Hindus.
71. Music director Khayyam is married to a Sikh woman by the name of  Jagjit Kaur.
76. Actress Dia Mirza’s mother, Deepa was Bengali Hindu and father, a German (Christian). They divorced and her mother remarried a Muslim, Ahmed Mirza when Dia was a child. He died in 2002. Dia chose to retain the surname Mirza, though she is not a Muslim.
77. Liquor Tycoon Vijay Mallaya is married to Rekha. This is the second marriage for both of them.  Rekha was previously married to Mr Mahmood and had a daughter, Laila. Vijay and Rekha have adopted Laila and she is now called Laila Mallaya.
82. Legendary singer Talat Mahmood’s son Khalid is married to Reena Pande. Talat Mahmood’s wife, Latika was a Christian.
83. Kabir Bedi’s daughter, actress Pooja Bedi was married to Farhan Furniturewalla. They are now divorced. They have two children, Aliya and Omar.
86. Music director Salim Merchant (of Salim-Sulaiman duo) is married to a Hindu woman.
87. Indian Cricketer Saba Karim is married to Rashmi Roy. They have one son, Fidel.
89. Classical percussionist Taufique Qureshi is married to vocalist Geetika Varde. Their son is Shikhar Naad.
90. Politician LK Advani’s niece is married to a Muslim.
93. Social activist Teesta Setalvad is married to Javed Anand. Their daughter is Tamara and son Jibraan.
89. Actor Imran Khan is married to Avantika Malik. He is son of Anil Pal and Nuzhat Khan (Aamir Khan’s sister) who are now divorced. Imran prefers to use the surname Khan, perhaps for commercial reasons. 
103. Indian Cricketer Mohammed Kaif married Pooja Yadav.
112. Vice President of India, Mohammed Hidayatullah (died 1992) who also served as the Chief Justice of Supreme Court, was married to Pushpa Shah. Their son Arshad is a lawyer.
119. Late Indian Economist-diplomat Abid Hussain was married to Trilok Karki. They have two sons, Suhail and Rana  and a daughter, Vishakha.
--- http://creative.sulekha.com/muslim-husbands-and-hindu-wives_591006_blog