24, అక్టోబర్ 2011, సోమవారం

ఫత్వాలు

ఫత్వాలు ముఫ్తీలు,ఉలేమాలు ప్రకటిస్తారు.అవి మంచిగా ఉంటే అంగీకరిస్తారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే ఫత్వాలను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం,మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.ఇస్లాంలో దర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని ఫత్వాలు ఇచ్చినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.

నిరసనలు ఎదుర్కొన్నఫత్వాలు:1.వడ్డీ, జూదం ఆధారంగా రూపొందినందువల్ల బీమా పాలసీలు ఇస్లాంకు వ్యతిరేకం.ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు,నాకు కూడా బీమా పాలసీలున్నాయి అన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌,2.బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం,3.ముస్లిం మహిళలు న్యాయమూర్తి పదవి చేపట్టడం నిషిద్ధం.4.పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఒక ప్రేమ జంట పెళ్ళికి వెళ్ళొద్దు.5.వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పాటను ముస్లింలు పాడకూడదు.
కొన్నిమంచి ఫత్వాలు:1.కర్ఫ్యూ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.2.ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం (హరామ్ )నిషిద్ధం.ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉంది. (జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్)


 తక్వా అంటే సహృదయత,భయభక్తులతో కూడిన జ్నానము, సద్గుణ సంపన్నత,దైవ విదేయత.తక్వా అంటే పాపభీతి,దైవభక్తి.శాంతి సహనాల కోసం ఉగ్రవాదులు తక్వా అలవరుచుకోవాలి.ఇస్లాం అంటే శాంతి కాబట్టి ముస్లిం ఎల్లవేళలా శాంతికాముకుడై ఉంటాడు.ఉండాలి.తక్వా సమాజంలో శాంతిసామరస్యాలను నెలకొల్పుతుంది."ఓ అల్లా,నన్ను తక్వాప్రజలపై నాయకునిగా చెయ్యి" అని ఉమర్ ప్రార్ధించారు."మీఅందరికంటే నేను ఎక్కువ తక్వాగలవాడిని" "విశ్వాసిలో ఉండే గొప్ప సుగుణమే తక్వా" అన్నారు ప్రవక్త.(అల్ మువత్తా 15:42,18:13,21:35).తక్వా అంటే హృదయంలో ఉన్న భక్తిభావన,దైవభీతి (హజ్ 22:32).షరియత్ (ధర్మశాస్త్రం) తక్వా ప్రకారం ఉండాలి.సౌదీ అరేబియా రాచరికదేశం.రాచరికం ఇస్లాంకు విరుద్దం.ఇస్లాం ప్రజాస్వామ్యాన్ని కోరుతుంది.ఇస్లాం ప్రకారం అయితే ముందు అక్కడ రాజు దిగిపోయి స్వేచ్చాయుత ఎన్నికలు జరగాలి.రాచరిక నియంతృత్వ దేశాలను మనం మాదిరిగా ఆదర్శంగా తీసుకోకూడదు.ఫత్వాలిచ్చే సంస్థలు రాచరిక వ్యవస్థను నిర్మూలించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోటానికి పూనుకోవాలి.

21, జులై 2011, గురువారం

గర్భనిరోధం

తన పేరును "గర్భనిరోద్ " గా మార్చుకొని ఆ పేరును తన నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకొన్నాడు " పిల్లలను కనవద్దు-బాధలలోకి వారిని దించవద్దు' లాంటి నినాదాలు తన బ్రీఫ్ కేస్ మీద పెయింట్ చేయించుకొని హైదరాబాదు సిటీ బస్సుల్లో తిరిగాడు.అవివాహితుడు ఆజన్మ బ్రహ్మచారి .మనతెలుగు ప్రజలలోఅరుదైన వ్యక్తి.కొన్నేళ్ళ క్రితం ఇతని మీద ఈనాడు ఆదివారం సంచికలో ప్రత్యేక కదనం కూడా వెలువడింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.

సిద్దాంతం

గర్భం దాల్చకుండా నిరోధించడమే నా లక్ష్యం.గర్భస్రావానికి నేను వ్యతిరేకిని.గర్భనిరోధంలో కుటుంబనియంత్రణ ఉంది కానీ కుటుంబనియంత్రణలో గర్భనిరోధం లేదు.పుట్టుకే దుఖాలకు మూలం.పుట్టుకను నిరోదించాలి.దీనికి మతం అడ్డువస్తోంది.మత పెద్దలు వాళ్ళ మతస్తుల సంఖ్యను పెంచుకోటానికే ప్రయత్నిస్తారు.రాజకీయ నాయకులకు కూడా జన సంఖ్య పెరగడమే ముఖ్యం.గర్భనిరోధం చేసే పద్ధతులన్నిటినీ అవి ఎలాంటివైనా నేను సమర్దిస్తాను.దేవాలయాలమీద బూతుబొమ్మలు పుట్టుకలను పెంచటానికే చెక్కించారు.పుత్రుడు పుడితేనే పితరులకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని నమ్మించారు.పాండవుల్ని లక్క ఇంటిలో కాల్చేనాడు కూడా "ఆత్మకు చావులేదు" అనే మాట కృష్ణుడు అనుకోవచ్చుకదా?ఆ పని తప్పు అని ఎందుకు అన్నాడు? తమ వేద ప్రమాణాన్ని అంగీకరించనివాడే నాస్తికుడు అని వేదవేత్తల అభిప్రాయం.అన్ని మతాలవాళ్ళూ తమకు దేవుడు ఉన్నాడంటారుగానీ వాళ్ళపేర్లు వేరేగా ఉంచటానికే కృషిచేస్తారు.వివేకానందుడు కూడా చేపలు తినేవాడు.నాస్తికం కూడా మతమే.నాదీ మతమే.నాది ప్రేమ మతం.నిజమైన ప్రేమ అంటే ఏమిటో గుర్తించండి."పుట్టుకలను నిరోదించి పిల్లలకు ఏ బాధా లేకుండా చెయ్యటమే,దుఖాలన్నిటినుండి రక్షించటమే నిజమైన ప్రేమ ".పుట్టించటమే అతి క్రూరమైన కార్యం.ప్రతి కార్యానికి కర్త ఉంది.సృష్టి జీవి ప్రమేయం లేకుండా జరిగింది.ప్రత్యుత్పత్తి జీవి వల్ల జరుగుతుంది.(25.2.1989న గర్భనిరోద్ నాతో చెప్పిన మాటలు).

అతను చెప్పిన మాటలన్నిటితో అందరూ

ఏకీభవించకపోవచ్చు గానీ మనం ఆంగీకరించాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయనిపిస్తోంది.