26, జులై 2012, గురువారం

దర్గాల సందర్శన


దర్గాల సందర్శన (జియారత్)

అసలు కారణం
ఔలియాల దర్గా ల సందర్శన అసలు కారణం ధార్మిక చింతన పెంపొందించడం, పెద్దవారి చరిత్రలను గుర్తుంచుకొని, వారు నడచిన ధార్మిక మార్గాలలో నడచి అల్లా ను ప్రసన్నం చేసుకోవడం. మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. ఏనాటికైనా మరణిస్తాననే ఆలోచన వస్తే, మనిషి  ధర్మమార్గాన్ని ఆచరించటానికి ప్రయత్నిస్తాడు. 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించి, పాప కర్మలకు దూరంగా వుంటూ సత్యమైన జీవితాన్ని గడుపుతాడు.
కానీ ఏం జరుగుతోంది?
ఇక్కడకు వచ్చిన భక్తుల బాధలను, ఆరోగ్య సమస్యలను భూత ప్రేత గ్రహబాధలను ఔలియాలు  సమాధి నుండే తొలగించి రక్షిస్తారని పిచ్చిపట్టినవారు, మానసిక ప్రశాంతత లేనివారు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నట్లయితే మంచివారుగా మారుతారని  నమ్ముతున్నారు. దర్గాలో పెద్దపండుగలాగా నిర్వహించే ఉరుసు ఉత్సవంలో నమాజు చదివించి బెల్లం, మిఠాయిలు, జిలేబీలు, గులాబీలు, మల్లెపూలు సమాధుల వద్ద సమర్పిస్తున్నారు. ఉరుసు ఉత్సవంలో సుగంధ పరిమళాలు, గులాబీలతో కలిపిన గంధాన్ని తీసుకుని వస్తారు.పవిత్ర గ్రంథాన్ని మోసుకొని వస్తున్న వ్యక్తిని, అతని తలపై ఉన్న గంధాన్ని తాకుతారు. గంధాన్ని స్పృశించిన భక్తులు పునీతులవుతారని నమ్ముతున్నారు.సినిమాలు బాగాఆడాలనీ,ఎన్నికల్లో గెలవాలనీ స్వార్ధపూరిత కోరికలు ఏకంగా సమాధిలోని సర్వ సంఘ పరిత్యాగులైన ఫకీరు భక్తుల్నేకోరుతున్నారు.
ఏం చెయ్యొచ్చు?
సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చు.సమాధులలో ఉన్నవారి మోక్ష సిద్ధి కోసం ప్రార్థన చేయవచ్చు.సమాధులలో ఉన్నవారి పేర్ల దాన ధర్మాలు చేయవచ్చు.సమాధుల దగ్గర  ఖురాన్ పఠించవచ్చు.ఔలియాలు గౌరవనీయులు, వారినీ వారి సమాధులనూ గౌరవించాలి.
ఏం చెయ్యకూడదు?
 ఔలియాల సమాధులకు సాష్టాంగ ప్రమాణాలు చేయరాదు.ఔలియాలకు నోములు (మన్నత్ లు) నోయకూడదు. తల నీలాలు సమర్పించకూదదు. ఔలియాలకు ప్రార్థనలు చేయకూడదు.ప్రార్థనలు ఆలకించేవాడు  అల్లా ఒక్కడే.ఔలియా సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయరాదు.ఔలియాల  సమాధులే సర్వస్వం అన్నట్లు సమాధుల వద్ద స్థోత్ర గీతాలు (మన్ ఖబత్ లు) పాడుకుంటూ వుండి పోయి అసలుదేవుడైన అల్లా ను మరచిపోకూడదు. కాదు.అల్లా ప్రసన్నత పొందటానికి ఇవి ద్వారాలు కాదు.ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు.ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ విశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగి 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.అందుకే ముహమ్మదు గారు తన సమాధిని దర్గా లాగా చేయటానికి అనుమతించలేదు.

24, జులై 2012, మంగళవారం

సూఫీ



సూఫీ
  • సూఫీల బోధనలు మన భారతీయ ఋషుల భావాలకు దగ్గరగా ఉంటాయి.వీరి వల్లనే ఇస్లాం ఇండియాలో బాగా ప్రచారమయ్యింది. సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు.అమృతకుండఅనే హర్షయోగ గ్రంధాన్ని పర్షియన్‌లోకి అనువదించుకున్నారు . జీవాత్మ, పరమాత్మ ఐక్యమవ్వాలనే అద్వైత భావనను సూఫీలు స్వీకరించారు. బెంగాల్‌లోని సూఫీ ముస్లింలు.. సీతా, కాళీ వంటి హిందూ దేవతలను ఆరాధించారు. కొందరు దీనిని అంధమార్గం, పహిల్వానుల, మల్లయోధుల క్రీడ అన్నారు.కానీ కొందరు సూఫీతత్వం జ్ఞాన నేత్రం, అత్మీయ మంత్రం అన్నారు.సూఫీతత్వము శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడుకున్నది . దర్గాలు ఆధ్యాత్మిక గురువుల సమాధులు. 
  • భారతీయ సూఫీ యోగుల్లో ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్టీ , షా హుస్సేన్ ‌, సయ్యద్‌ అలీ హైదర్ ‌, ఫర్ద్‌ ఫకీర్ ‌, ఖలందర్‌ హజ్రత్‌ సాయి ఖుతాబ్‌ అలీ షా , హజ్రత్‌ సాయి రోషన్‌ అలీ షా , హదీబక్ష్‌ లు ప్రముఖులు.
  • 'సూఫీ' అంటే 'కంబళి బట్ట' అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి 'సూఫీ' అని పేరొచ్చింది.'సూఫీ' అంటే- పవిత్రతకు, (భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! సూఫీ యోగి అంతర్దృష్టితో ధ్యానతత్పరుడై, సత్యాన్వేషకుడై ఉంటాడు.ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మ లో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.ఆడంబరాలకూ దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలు. సూఫీ తత్వానికి దశ-దిశ మార్గ దర్శకత్వము లేవు. అదొక  'గాలివాటు ధోరణి అని ముస్లిములు అంటారు
  • పరమాత్ముని  విడిచి మనలేని మధురభక్తి ఇది. దేవునిప్రేమిస్తూ తమ  ప్రాణాలు అర్పించి దైవ  సాన్నిధ్యాన్ని పొందుతారు.భగవంతుని తో  భక్తుని  ఆత్మ అనుసంధానం జరిగేది  ప్రేమ భక్తితోనే .  సూఫీ యోగులు దేవుడిపై మధురమైన భావన('ఇష్క్‌ హక్కికీ )తో దైవ సాన్నిద్యం  పొందాలని ప్రయత్నిస్తారు. సూఫీ తత్వం మత పరిధులను దాటివిశాల మధురభక్తి సిద్ధాంతం. సూఫీ యోగులందరూ భగవంతునిపై ఆధారపడి జీవనం సాగించారు. నవాబులు, ప్రభువులు అందించిన కానుకలను తిరస్కరించారు. ఆర్భాటాలకు తావివ్వకుండా, అహంకార రహితులై,దైవ నామసంకీర్తనం చేస్తూ భక్తులకు సందేశాలు అందిస్తూ, సత్యాన్వేషణలో ఆత్మ సాక్షాత్కారం  చేసుకున్నారు. సూఫీ యోగులు నిశ్చల క్తి  భావంతో, భగవత్‌ ప్రణయ సౌందర్యంలో తన్మయీభూతులై తమ జీవాత్మలను పరమాత్ముడైన అల్లాహ్‌ లో ఐక్యం చేసుకున్నారు.పాపకార్యాలకు దూరంగా ఉండటం,దైవానికి దగ్గరకావటం,దైవంపట్ల అచంచలమైన ప్రేమను ప్రకటించి సంపూర్ణ సమర్పణ చేసుకోవటమే భయభక్తి (తక్వా) గా భావిస్తారు.
సూఫీ బోధనలు: 
  • డబ్బు ముట్టుకోరాదు.పేదరికమే సుగుణం.
  • బ్రహ్మచర్యం తప్పనిసరి కాదు.ఆధ్యాత్మిక పురోగతికి, కుటుంబ జీవితం ఆటంకం కాదు.ప్రపంచాన్ని త్యజించి క్రియారాహిత్యంతో జీవించవద్దు..భౌతిక శ్రమ తో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని అన్వేషించాలి. రైతులుగా , నేతపని వారుగా, కసాయి పనివారుగానైనా సరే శ్రమించాలి.
  • భగవంతుని పట్ల ప్రేమ, భక్తి ప్రపత్తులే మోక్షాన్ని ప్రసాదిస్తాయి.జీవాత్మ పరమాత్మతో సమైక్యమవ్వాలి.
  •  భగవంతునికి, మానవులకు మధ్య ప్రేమికుల సంబంధం ఒక్కటే కాకుండా యజమాని - బానిసల సంబంధం కూడా ఉండాలి
  • మక్కా, గంగ మోక్షాన్ని ఇవ్వలేవు.అహాన్ని పరిత్యజించడమే మోక్ష మార్గము.-- బుల్లేషా .
  • భగవంతడు అంటే  రామ్, రహీమ్, అల్లా --- కబీర్
  • సైతానుకి ఎవరన్నా పరిశుద్ధంగా కనిపిస్తే ఓర్వలేక జ్వరంతో మంచమెక్కుతాడు
  • నీలో ఉన్న ప్రతి భాగానికి ఒక రహస్య భాష వుంది.నీ చేతులు, కాళ్లు నువ్వేం చేశావో చెబుతాయి.-- మౌలానా రూమీ
  • కన్నీరు కార్చేవాళ్లతో దయగా వుండు నిస్సహాయుల పట్ల దయ చూపు -- మౌలానా రూమీ
  • అల్లాను ప్రేమిస్తున్నావా?' -ఔను అహర్నిశలూ . మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? లేదు, అందుకు సమయం ఎక్కడిది?-- రబియా
  • చాలా మంది రాజులు తలలు పోగోట్టుకోటానికి కారణం/ వారు తాల్చిన రత్నఖచిత కిరీటాలు -- హాఫిజ్ షీరాజీ
  • "మంచివారికి ప్రేమ మధురమైన బాధ.చెడ్డవారికి ప్రేమ ఒక అందమైన అబద్దం.హింసకు పాల్పడటానికి ఒక సాకు.సార్వజనీన సోదరభావం ప్రేమ. ప్రేమే దైవం.దేవునికున్న99 పేరుల్లో ఒకటి 'అల్-వదుద్' అంటే "ప్రియమైనవాడు" "దయగల ప్రేమికుడు"(ఖురాన్ 11:90,85:14) అందరికీ దేవుని ప్రేమ లభిస్తుంది.ఇష్క్ అంటే దేవుని ప్రేమ.దేవుని కరుణే విశ్వంపై ప్రేమగా కురుస్తుంది.
  • దేవుడు ప్రేమలోని అందాన్ని గుర్తించాలని కోరుకుంటాడు, ఎవరికీ వారు అద్దంలో చూసుకున్నట్లుగా, దేవుడు తననితాను తన సృష్టిలో చూసుకుంటాడు.ప్రతి వస్తువూ దేవుని సృష్టితం కాబట్టి బయటకు అసహ్యంగా కనిపించే దాని లోపల కూడా అందాన్ని చూడాలి.
  • దేవుడిని ప్రేమించే ప్రయాణంలో ప్రతి మతమూ తన దైవం పట్ల "ప్రేమమతం" గా మారుతుంది.ఆయా మతాల దృష్టిలో తమ దేవుడు ప్రేమికుడు, ప్రేమించబడ్డవాడు, మరియు అతిప్రియతముడు.ప్రేమ ద్వారానే మానవజాతి శాశ్వతమైన పవిత్రతను గౌరవాన్ని పొందగలదు. దేవుని పట్ల ప్రేమతో భక్తులు"ప్రేమ మైకంలో" ఉంటారు".
  • భక్తి కూడా ప్రేమే.ప్రేమ శరీర,మానసిక,ఆద్యాత్మిక దశలన్నిటిలోను నొప్పినే పుట్టిస్తుంది.ప్రేమ అంటే బాధనే సుఖమనుకోవటం,సుఖంకోసమే బాధపడటం.ప్రియులకోసమైనా, దేవుడి కోసమైనా సరే ప్రేమ ఒక పిచ్చి ఆనందం,ఒక వెర్రి ఏడుపు.భక్తుడూ,ప్రేమికుడూ ప్రేమ మత్తులోనే  తూగుతుంటారు.ప్రేమలోనే ఆనందం,ప్రేమలోనే విలాపం.
  •  సూఫీతత్వం మహర్షులందించిన ఆధ్యాత్మిక జ్ఞానం. ముహమ్మద్ ప్రవక్త కూడా ఒక మహర్షియే. అతనూ సంవత్సరాల తరబడీ హిరా గుహలో "మురాకిబా", "జిక్ర్" (ధ్యానం, తపస్సు లాంటివి) చేసినవారే. ఆతరువాతే వారికీ ప్రవక్త పదవి,ఖురాన్ గ్రంధము లభించాయి. సున్నీలకు వహాబీలకు పడటం లేదు. ఇద్దరిలోనూ  అతివాదాలున్నాయి. సూఫీ గురువు పైగంబరులవారు (మహర్షి వర్యులు) ముహమ్మద్ ప్రవక్తయే. వలీలు, ఔలియా లు , అల్లాహ్ కు సన్నిహితులు కాబట్టి వారిని గౌరవిస్తారు గాని కొలవరు, ఆరాధించరు, పూజించరు. దస్తగిరయ్య, గోకారమయ్య వంటి పేర్లతో దర్గాలున్నాయి. దర్గా దగ్గర కందూరు పలావ్ రుచి చూడాలి, కళ్ళకు, గొంతుకు ఉదానీ అద్దుకోవాలి ,పీర్ల చావిడి దగ్గర దూల ఆడాలి అని హిందువులే ఎక్కువగా  ముందుకు వస్తారు. హిందూ ముస్లిం సమైక్యతకు దర్గాలు వారథులుగా మారాయి. 
  • దస్తగిరయ్య : దస్తగిరి + అయ్య ; "దస్తగీర్" అంటే  చేయిపట్టి మార్గం చూపించువాడు.సూఫీ గురువు అబ్దుల్ ఖాదిర్ జీలానీ ని బడే పీర్, మహబూబ్ సుబహానీ, గౌసుల్ ఆజం దస్తగీర్  అని కూడా పిలుస్తారు. ఈయన  పేరు మీదే "గ్యార్వీ కే ఫాతెహా" గ్యార్వీ పండుగ  చేస్తారు. గ్యార్మీలు అంటే చదివింపులు
    గోకారమయ్య : గోరఖ్ ధందాఅంటే  "అర్థం కాని విషయం", బుర్రకందని వాడు దేవుడు.అల్లాహ్ లేదా పరమేశ్వరుణ్ణి "తుమ్ ఏక్ గోరఖ్ ధందా హో" అనీ, నువ్వు బుర్రకందని గోకారమయ్యవు అనీ పిలుస్తారు. 
    కందూరు : కందోరీ "నోము" "మొక్కుబడి" నియాజ్ - మన్నత్ నోచి తీర్చుకునే సంబరం, వలీ పీరు, సూఫీ గురువు అల్లాహ్ సాన్నిధ్యాన్ని చేరుకునే సందర్భాన జరుపుకునే సంబరం. 
    ఊదాని : మనం ఊద్ (సాంబ్రాణి) లా కాలి సుగంధాన్ని వెదజల్లి పొరుగువారికి మంచి ఆలోచనలను కలుగ జేయాలి.
           దూలా : పీర్ల పండుగ మొహర్రం పండుగనాడు కర్బలా కథ   చెబుతూ   "అలావా" చుట్టూ తిరుగటం.