21, జులై 2011, గురువారం

గర్భనిరోధం

తన పేరును "గర్భనిరోద్ " గా మార్చుకొని ఆ పేరును తన నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకొన్నాడు " పిల్లలను కనవద్దు-బాధలలోకి వారిని దించవద్దు' లాంటి నినాదాలు తన బ్రీఫ్ కేస్ మీద పెయింట్ చేయించుకొని హైదరాబాదు సిటీ బస్సుల్లో తిరిగాడు.అవివాహితుడు ఆజన్మ బ్రహ్మచారి .మనతెలుగు ప్రజలలోఅరుదైన వ్యక్తి.కొన్నేళ్ళ క్రితం ఇతని మీద ఈనాడు ఆదివారం సంచికలో ప్రత్యేక కదనం కూడా వెలువడింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.

సిద్దాంతం

గర్భం దాల్చకుండా నిరోధించడమే నా లక్ష్యం.గర్భస్రావానికి నేను వ్యతిరేకిని.గర్భనిరోధంలో కుటుంబనియంత్రణ ఉంది కానీ కుటుంబనియంత్రణలో గర్భనిరోధం లేదు.పుట్టుకే దుఖాలకు మూలం.పుట్టుకను నిరోదించాలి.దీనికి మతం అడ్డువస్తోంది.మత పెద్దలు వాళ్ళ మతస్తుల సంఖ్యను పెంచుకోటానికే ప్రయత్నిస్తారు.రాజకీయ నాయకులకు కూడా జన సంఖ్య పెరగడమే ముఖ్యం.గర్భనిరోధం చేసే పద్ధతులన్నిటినీ అవి ఎలాంటివైనా నేను సమర్దిస్తాను.దేవాలయాలమీద బూతుబొమ్మలు పుట్టుకలను పెంచటానికే చెక్కించారు.పుత్రుడు పుడితేనే పితరులకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని నమ్మించారు.పాండవుల్ని లక్క ఇంటిలో కాల్చేనాడు కూడా "ఆత్మకు చావులేదు" అనే మాట కృష్ణుడు అనుకోవచ్చుకదా?ఆ పని తప్పు అని ఎందుకు అన్నాడు? తమ వేద ప్రమాణాన్ని అంగీకరించనివాడే నాస్తికుడు అని వేదవేత్తల అభిప్రాయం.అన్ని మతాలవాళ్ళూ తమకు దేవుడు ఉన్నాడంటారుగానీ వాళ్ళపేర్లు వేరేగా ఉంచటానికే కృషిచేస్తారు.వివేకానందుడు కూడా చేపలు తినేవాడు.నాస్తికం కూడా మతమే.నాదీ మతమే.నాది ప్రేమ మతం.నిజమైన ప్రేమ అంటే ఏమిటో గుర్తించండి."పుట్టుకలను నిరోదించి పిల్లలకు ఏ బాధా లేకుండా చెయ్యటమే,దుఖాలన్నిటినుండి రక్షించటమే నిజమైన ప్రేమ ".పుట్టించటమే అతి క్రూరమైన కార్యం.ప్రతి కార్యానికి కర్త ఉంది.సృష్టి జీవి ప్రమేయం లేకుండా జరిగింది.ప్రత్యుత్పత్తి జీవి వల్ల జరుగుతుంది.(25.2.1989న గర్భనిరోద్ నాతో చెప్పిన మాటలు).

అతను చెప్పిన మాటలన్నిటితో అందరూ

ఏకీభవించకపోవచ్చు గానీ మనం ఆంగీకరించాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి